AKP: అచ్యుతాపురం మండలం నునపర్తిలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ఎలమంచిలి నియోజకవర్గం సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేద ప్రజల కష్టాల నుంచి టీడీపీ ఆవిర్భవించిందన్నారు. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు.