NTR: నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య టీడీపీ జండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, టీడీపీ చారిత్రక ప్రస్థానంలో కార్యకర్తల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.