TG: ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావటం బాధాకరమని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్తింటికి వెళ్లిన ఆడపిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూడలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకే కాదు.. ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తిని సామాజికంగా బహిష్కరించాలన్నారు.