ASR: మారుమూల గిరిజన ప్రాంతాల్లో బెల్ట్ షాపులు పెంచి మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆరోపించారు. గిరిజనులు చిన్న మొత్తంలో మద్యం తీసుకెళ్తే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని ప్రశ్నించారు. బ్రాందీ షాపులు మూసేయాలని లేదా తాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, లేదంటే పూర్తిస్థాయి నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.