NDL: మహానంది మండలం గాజుల పల్లెకు చెందిన షేక్ ఇమామ్ కాసిం, హుస్సేన్ వలీలు వేరువేరు ప్రమాదాల్లో ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఆదివారం ఆత్మకూరులో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున ప్రమాద బీమా నగదు బాధిత కుటుంబాలకు అందజేశారు. సొసైటీ ఛైర్మన్ ఉమామహేశ్వర్ రెడ్డి చోరవతో ఇప్పించినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.