NZB: సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డిని మాక్లూర్ మండలంలోని సర్పంచులు కోరారు. ఆయన స్వగ్రామంలో కలిసి ఇవాళ వినతిపత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉప సర్పంచులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.