SRPT: మేళ్ళచెర్వు మండల కేంద్రంలోని స్వయంభూ శంభూలింగేశ్వర స్వామి, ఇష్టకామేశ్వరి అమ్మవార్లను, అలాగే మట్టపల్లి లక్ష్మీనరసింహా స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంఘటన మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సందర్శించారు. ఆలయాల్లో స్వామివార్లకు వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు.