NLG: ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’లో భాగంగా నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ ఎండీ. అబ్దుల్ జమీర్ తెలిపారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.