NLG: దేవరకొండలో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేసి వేడుకలని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.