• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మాజీ సర్పంచ్ కుటుంబానికి గండ్రత్ సుజాత పరామర్శ

ADB: తాంసి మండల కేంద్రంలో టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత శనివారం పర్యటించారు. గ్రామ మాజీ సర్పంచ్ రతన్ భార్య అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గండ్రత్ సుజాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె వెంట మండల కాంగ్రెస్ నాయకులు కౌడల సంతోష్, కార్యకర్తలు, తదితరులున్నారు.

March 29, 2026 / 09:06 AM IST

జిల్లాల్లో పడిపోతున్న గ్రౌండ్ లెవెల్స్

వికారాబాద్ జిల్లాల్లో రోజురోజుకు భూగర్భ జలాల స్థాయి పడిపోతోంది. అనేక ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో భూగర్భ జలాలు సగటున 12.87 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేసవి వేళ భూగర్భ జలాలు పడిపోతున్నాయి.

March 29, 2026 / 09:06 AM IST

‘రాజధాని బిల్లుకు వైసీపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలి’

VZM: అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా గుర్తించే తీర్మానానికి చట్టబద్ధత ఇవ్వడం అభినందనీయమని జనసేన సీనియర్‌ నేత గురాన అయ్యలు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో ఉన్న అస్పష్టతను తొలగించడమే కూటమి లక్ష్యమని, ఏప్రిల్‌ 1న కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం, 2న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. దీనికి YCP MPలు మద్లతు ఇవ్వాలన్నారు.

March 29, 2026 / 09:05 AM IST

గాజువాక జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

VSP: ఎన్ఏడీ నుంచి పోర్టు రోడ్డుకి వెళ్తున్న లారీ ఆదివారం తెల్లవారుజాము 5 గంటల సమయంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. గాజువాక ట్రాఫిక్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాన్ని పక్కకి నెట్టామన్నారు.

March 29, 2026 / 09:05 AM IST

జిల్లాలో చికెన్ ధరల వివరాలు

CTR: జిల్లాలో చికెన్ ధరలు కొద్దిమేర తగ్గాయి. ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.139 నుంచి రూ.140, మాంసం రూ.202-రూ. 215 వరకు పలుకుతోంది. స్కిన్‌లెస్ రూ. 229-రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరో వైపు 12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

March 29, 2026 / 09:05 AM IST

జనగణనను ఖచ్చితంగా నిర్వహించాలి: కలెక్టర్

HNK: కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెలలో ప్రారంభమయ్యే జనగణన ప్రక్రియను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి ఇంటి సమాచారాన్ని సమగ్రంగా సేకరించాలని, ఈ డేటా ప్రభుత్వ ప్రణాళికలకు కీలకమని పేర్కొన్నారు.

March 29, 2026 / 09:05 AM IST

నల్గొండ జిల్లాలో చికెన్ ధర ఎంతంటే ?

 చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు కేజీ చికెన్ ధర 380 వరకు ఉండగా ఆదివారం కాస్త ధరలు దిగొచ్చాయి. పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి.. స్కిన్‌ చికెన్ కేజీ ధర రూ. 235 నుంచి రూ. 240 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 267 నుంచి రూ. 280 వరకు పలుకుతోంది. అయితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. 

March 29, 2026 / 09:04 AM IST

వైద్యులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

NRML: జిల్లాలోని ఎస్‌వీఆర్ ఆసుపత్రిలో పీడియాట్రిషియన్ డాక్టర్ సంతోష్ రాజ్‌పై దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యులు, సిబ్బందిపై దాడులు చేయడం తీవ్రమైన నేరమని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్న వారిపై దౌర్జన్యం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 29, 2026 / 09:04 AM IST

‘జాతీయ లోక్ అదాలత్‌’లో 5,625 కేసుల పరిష్కారం

WNP: జిల్లాలో నిర్వహించిన ‘జాతీయ లోక్ అదాలత్’ ద్వారా 8 బెంచీలలో మొత్తం 5,625 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత తెలిపారు. రాజీ పడితే కక్షిదారులు ఇద్దరూ విజేతలేనని, సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. చెక్ బౌన్స్, రోడ్డు ప్రమాదాలు, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కేసులను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు వెల్లడించారు.

March 29, 2026 / 09:04 AM IST

మూసీ డెవలప్‌మెంట్.. అనేక చోట్ల రిటైనింగ్ వాల్స్

HYDలో మూసీ నది అభివృద్ధిపై ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఉస్మాన్‌సాగర్ నుంచి వచ్చే జలాలు కలుషితం కాకుండా పరిరక్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూసీ ప్రవాహ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించింది. నది పరివాహక ప్రాంతాల్లో మురుగు ప్రవాహాన్ని అడ్డుకునేలా అనేక చోట్ల రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేపట్టనుంది.

March 29, 2026 / 09:04 AM IST

మూసీ పరివాహక ప్రాంతాల్లో ఫీవర్ కేసులు.. జాగ్రత్త..!

RR: వేసవిలోనూ మలేరియా వంటి విషజ్వరాలు వస్తున్నాయి. నాగోల్, మూసారాంబాగ్, గౌలిగూడ, లంగర్ హౌజ్ ప్రాంతాలతో పాటు, మూసీ నది పరివాహక ప్రాంతాల్లో గత 35 రోజుల్లో 12 కేసులు నమోదయ్యాయి. మురుగు నీటి నిల్వలు, దోమల పెరుగుదల కారణంగా వ్యాధి వ్యాప్తి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

March 29, 2026 / 09:02 AM IST

రేపే డిగ్రీ కళాశాల పరీక్షల ఫీజు చివరి తేదీ

NZB: TU పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యను అభ్యసిస్తున్న 2,4,6 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ విద్యార్థులు తమ పరీక్ష ఫీజులు చెల్లించడానికి రేపటికి చివరి గడువని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సంపత్ కుమార్ తెలిపారు. రేపటి లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ ను సందర్శించాలన్నారు.

March 29, 2026 / 09:01 AM IST

లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం: జిల్లా ఎస్పీ

KMR: జాతీయ లోక్ అదాలత్​లో శనివారం భారీగా కేసులు పరిష్కారామయ్యాయి. బాధితులకు కూడా భారీగానే పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఎనిమిది బెంచ్​లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 4,506 కేసులు పరిష్కారం కాగా బాధితులకు రూ.1,95,97,781 అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

March 29, 2026 / 09:01 AM IST

కంభంలో సీఐ ప్రత్యేక డ్రైవ్

ప్రకాశం: కంభంలోని ప్రధాన రహదారులపై అనధికార LED, అధిక కాంతి లైట్ల వినియోగంపై కంభం సీఐ మల్లికార్జున శనివారం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ సందర్భంగా మార్పులు చేసిన LED హెడ్ లైట్లు, ఫ్లాష్ లైట్లు, మల్టీకలర్ లైట్లు అమర్చిన వాహనాలను తనిఖీ చేశారు. నియమాలకు విరుద్ధంగా ఉన్న లైట్లను అక్కడికక్కడే తొలగించి, సంబంధిత వాహనదారులపై చర్యలు తీసుకున్నారు.

March 29, 2026 / 09:00 AM IST

కంచికచర్లలో ఘనంగా ‘మట్టల’ వేడుకలు

NTR: కంచికచర్లలో మట్టల ఆదివారం వేడుకలు మిన్నంటాయి. కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఖర్జూర మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. ‘రాజుల రాజుకు జై.. యూదుల రాజుకు జై’ అంటూ భక్తిశ్రద్ధలతో నినాదాలు చేస్తూ పురవీధుల్లో కీర్తనలు ఆలపించారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఉత్సాహంగా మట్టలు ఊపుతూ క్రీస్తును స్మరించుకున్నారు.

March 29, 2026 / 09:00 AM IST