MDK: రామాయంపేట మండల కేంద్రంలో వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని మండల తహశీల్దార్ రజనీకుమారి స్పష్టం చేశారు. కొంతమంది సైబర్ నేరగాళ్లు కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గ్యాస్ పంపిణీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినా లేదా కమీషన్ల కోసం వినియోగదారులను ఇబ్బంది పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
SDPT: రాయపోల్ మండలం వడ్లపల్లిలో గ్రామదేవత పోచమ్మకు భక్తులు బోనాలను సమర్పించారు. సంప్రదాయబద్ధంగా మహిళలు తలపై బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, డప్పుల వాయిద్యాలతో సందడి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
IPL ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ ‘ఛేజ్ మాస్టర్’ అని మరోసారి నిరూపించుకున్నాడు. IPL చరిత్రలో ఛేజింగ్ చేస్తూ 4000 పరుగుల మార్కును దాటిన ఏకైక బ్యాటర్‌గా కోహ్లీ(4027) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో వార్నర్(3285), రోహిత్ శర్మ(3238) వంటి దిగ్గజాల కంటే విరాట్ ముందున్నాడు. శిఖర్ ధావన్(2843), రాబిన్ ఉతప్ప(2832) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
TG: ప్రజలకు నష్టం జరిగితే ఆరు నూరైనా అడ్డుకుంటామని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట 10 వేల ఇళ్లను కూల్చి, వేల ఎకరాల భూములను లాక్కోవడాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అలాగే, ప్రభుత్వం దోపిడీకి వ్యతిరేకమని స్పష్టం చేశారు. సీఎం మాటలకు భయపడమని, రెండేళ్లలో ప్రజలే కాంగ్రెస్‌ను బహిష్కరిస్తారని విమర్శిస్తారు.
స్టార్ మా: కుబేర(8AM), సంతాన ప్రాప్తిరస్తు(1PM), ప్రేమంటే(3.30PM); జీతెలుగు: ది గ్రేట్ ఇండియన్ కిచెన్(9AM), శతమానం భవతి(12PM), తండేల్(2.30PM); జెమిని: నాంది(6AM), శివరామరాజు(9AM), విజిల్ (12PM), ఊపిరి(3.30PM), గుంటూరు కారం(6PM), దేవుడు చేసిన మనుషులు(10.30PM); స్టార్‌మా మూవీస్:చంద్రముఖి(12PM), KGF(3PM), పరుగు(6PM), సింగం-3(9PM); జీ సినిమాలు: 777 చార్లీ(3PM), ఘర్షణ(6PM).
SRHపై విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి RCBకి ఘనవిజయాన్ని అందించాడు. SRHపై కోహ్లీకి ఉన్న ఆధిపత్యానికి కోహ్లీ గత 5 ఇన్నింగ్స్ గణాంకాలే(100, 42, 51, 43, 69*) నిదర్శనం. రన్ మెషీన్ ధాటికి హైదరాబాద్ బౌలర్లు విలవిలలాడారు. ఈ భారీ ఛేదనతో RCB నెట్ రన్ రేట్ గణనీయంగా పెరిగింది.
తమిళ దర్శకుడు వెట్రిమారన్ ‘నీలిర’ ట్రైలర్ లాంచ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే, ‘దురందర్ 2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని...
దర్శకుడు వెట్రిమారన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ప్రస్తుతం ప్రతిదీ ప్రచారంగా మారుతోంది. నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్డ కష్టాలను ద్వేషపూరిత ప్రచారంతో మార్చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డాడు. ఇలాంటి ప్రచార చిత్రాలకు వ్యతిరేకంగా వాస్తవాలను చూపే సినిమాలు రావాలని ఆయన పిలుపునిచ్చాడు. అయితే, ‘ధురంధర్-2’ను ఉద్దేశించే ఆయన ఈ విమర్శలు చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన 200+ పరుగుల ఛేదనను RCB నమోదు చేసింది. SRHతో మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే పూర్తి చేసి RCB సరికొత్త రికార్డు సృష్టించింది. 2025లో GTపై రాజస్థాన్(15.5 ఓవర్లు) సాధించిన రికార్డును ఇప్పుడు RCB అధిగమించింది. ఈ టాప్-5 జాబితాలో RCB 2024లో గుజరాత్‌పై 16 ఓవర్లలో సాధించిన మూడో స్థానంలో ఉంది.
➢ 1952: ప్రముఖ రచయిత కె.ఎన్.వై.పతంజలి జననం➢ 1982: సినీ నటుడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు➢ 1997: భారతదేశ ప్రముఖ కళాకారిణి, రచయిత్రి పుపుల్ జయకర్ మరణం➢ 1932: తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన కొప్పరపు సోదర కవులలో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి మరణం.
SRHతో జరిగిన మ్యాచ్‌లో RCB 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డు సృష్టించింది. IPLలో RCBకి ఇది మూడో అత్యధిక విజయవంతమైన ఛేదనగా నిలిచింది. గతంలో 2025లో LSGపై 228, 2010లో పంజాబ్‌పై 204 పరుగుల లక్ష్యాలను RCB విజయవంతంగా ఛేదించింది. తాజా విజయంతో 2024లో GTపై సాధించిన 201 పరుగుల ఛేదన నాలుగో స్థానానికి చేరింది.
శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, శుక్ల పక్షం ఏకాదశి: ఉ. 8-55 తదుపరి ద్వాదశి ఆశ్లేష: సా. 3-43 తదుపరి మఘ వర్జ్యం: ఉ.6-28 వరకు, తిరిగి తె.3-31 నుంచి 5-05 వరకు అమృత ఘడియలు: మ.2-11 నుంచి 3-43 వరకు దుర్ముహూర్తం: సా.4-31 నుంచి 5-19 వరకు రాహుకాలం: సా.4.30 నుంచి 6-00 వరకు సూర్యోదయం: ఉ.6.01; సూర్యాస్తమయం: సా.6.08 మతత్రయ ఏకాదశి, వాడపల్లి తీర్థం.
రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ గ్రహీత విజయ్‌పత్ సింఘానియా(87) ముంబైలో కన్నుమూశారు. తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుమారుడు గౌతమ్ ధృవీకరించారు. 1980లో బాధ్యతలు చేపట్టిన విజయ్‌పత్, రేమండ్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఆయన హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఏవియేటర్. ముంబైలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
SRHతో జరిగిన మ్యాచ్‌లో RCB బౌలర్ జాకబ్ డఫీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 22 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి SRH భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో డఫీ తన మార్క్ చూపించి RCBకి సీజన్ తొలి విజయాన్ని అందించాడు.
WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఎస్టీ బాలుర వసతి గృహంలో ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజ్వల్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్ చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ చిదురు శంకర్ విద్యుత్ ఆదా, చెట్లు నాటడం, నీటి సంరక్షణపై ప్రజలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.