• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి

ప్రకాశం: పెద్దారవీడు మండలం మద్దలకట్ట జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు.

March 29, 2026 / 09:20 AM IST

అచోవీ చేపల నూనెలో BP తగ్గించే గుణాలు.!

HYD: ఉస్మానియా ప్రొఫెసర్ సందీప్త సూక్ష్మజీవ శాస్త్రంలో కీలక పరిశోధనలు నిర్వహించారు. చేపల నూనెలో రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ ధ్రువీకరణ లభించింది. ముఖ్యంగా అచోవీ చేపల్లోని అమైనో ఆమ్లాలను వినియోగించడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చని పేర్కొన్నారు.

March 29, 2026 / 09:19 AM IST

‘అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కనెక్టివిటీ పెంచాలి’

SRCL: వేములవాడకు అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ కనెక్టివిటీని పెంచాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆర్టీసీ సమస్యలపై శనివారం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.

March 29, 2026 / 09:19 AM IST

ఖమ్మం కార్పొరేషన్‌లో పన్నుల వసూలు ముమ్మరం

ఖమ్మం నగర ప్రగతిలో పన్నుల చెల్లింపు కీలక పాత్ర పోషిస్తుందని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేర్కొన్నారు ఈ మేరకు నగరంలో రాత్రివేళ్లల్లో కూడా ముమ్మరంగా పన్నుల వసూలను అధికారులు చేపట్టాతున్నారు. పన్నుల వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఖమ్మం నిర్మాణానికి వెచ్చిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలన్నారు.

March 29, 2026 / 09:18 AM IST

పోలీసులపై దాడికి పాల్పడ్డ ముగ్గురు అరెస్ట్

MDK: విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడ్డ ముగ్గురిని నిన్న రాత్రి అరెస్టు చేసినట్లు చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి కారులో వచ్చిన ముగ్గురు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద రాంగ్‌ రూట్లో వచ్చి వాహనాన్ని అడ్డంగా నిలిపారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా, దాడికి పాల్పడ్డ కారు డ్రైవర్ విజయ్, రామన్న గారి పవన్, బాలాజీలను అరెస్టు చేశారు.

March 29, 2026 / 09:17 AM IST

చికెన్ వ్యర్ధాలపై 21 డివిజన్ కార్పొరేటర్ ఆగ్రహం

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో చికెన్ వ్యర్ధాలపై గళమెత్తారు. చికెన్ విడుదల సేకరణ గురించి టెండర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. సేకరించిన చికెన్ విడదాలను క్యాట్ ఫిష్ పెంపకానికి ఉపయోగిస్తున్నారని, దానిద్వారా ప్రజలు అనారోగ్యం పాడిన పడతారని అన్నారు. వెంటనే తమ చర్యలు తీసుకోవాలన్నారు.

March 29, 2026 / 09:17 AM IST

ఆకివీడు ఘర్షణల కేసు.. 21 మందికి రిమాండ్

W.G: ఆకివీడు పెదపేటలో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించి 21 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. మొత్తం 57 మందిపై కేసులు నమోదు చేయగా, పట్టుబడిన వారిని శనివారం భీమవరం కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన వెల్లడించారు.

March 29, 2026 / 09:17 AM IST

బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటుపై అవగాహన

PDPL: ధర్మారం ఎంపీడీవో కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటుపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మధ్యలో బడి మానివేయడం, బాలల అక్రమ రవాణా, వేధింపులను అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సమావేశంలో ఎస్సై ప్రవీణ్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

March 29, 2026 / 09:16 AM IST

రాయచోటి‌లో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్

అన్నమయ్య: రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిషేధితభూముల రిజిస్ట్రేషన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్బవరం గ్రామంలోని సర్వే నెం.13/2 ప్రభుత్వ భూమిగా,సెక్షన్ 22(A) ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ పలువురు డాక్యుమెంట్ల ద్వారా రిజిస్ట్రేషన్లు జరిపినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా రిజిస్ట్రార్ నివేదిక ఆధారంగా డీఐజీ ఆదేశాలతో అధికారిని సస్పెండ్ చేశారు.

March 29, 2026 / 09:16 AM IST

నేడే పాలిటెక్న్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు

HNK: పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగానే నేడు నిర్వహించనున్నారు. ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలకు 70 సంవత్సరాలుగా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు నేడు ఉన్నత స్థానంలో ఉన్నారు.

March 29, 2026 / 09:16 AM IST

‘జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు’

WGL: జిల్లాలో 240 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులకు ఆదేశించారు. కేంద్రాలలో గోనే సంచులు, తేమ కొలిచే యంత్రాలు వంటి అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు.

March 29, 2026 / 09:15 AM IST

మద్యం మత్తులో అత్తను హత్య చేసిన అల్లుడు

NDL: బండి ఆత్మకూరు మండలం కడమలకాలువలో శనివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అనీల్ అనే వ్యక్తి రాత్రి మద్యం మత్తులో తన భార్య ఎస్తేరుతో గొడవపతుండగా.. అడ్డు వచ్చిందని అత్త పసుపుల కళావతిని కత్తితో పొడిచాడని స్థానికులు తెలిపారు. క్షతగాత్రురాలిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పరీక్షించి కళావతి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

March 29, 2026 / 09:14 AM IST

తండ్రుల మృతదేహాల వద్ద నుంచి టెన్త్ పరీక్షలకు

NLR: బోగోలు మండలం తెల్లగుంటకు చెందిన అక్షయ తండ్రి, కలిగిరి మండలం నాగసముద్రానికి చెందిన రేష్మ తండ్రి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇళ్లలో తండ్రుల మృతదేహాలు ఉన్నప్పటికీ, తీరని శోకంలోనే ఈ ఇద్దరు విద్యార్థినులు గుండెనిబ్బరంతో పదో తరగతి పరీక్షలకు హాజరై అందరినీ కంటతడి పెట్టించారు.

March 29, 2026 / 09:14 AM IST

ఏప్రిల్ 1న ఒంటిమిట్టకు CM చంద్రబాబు

AP: CM చంద్రబాబు కడప జిల్లా ఒంటిమిట్ట పర్యటన షెడ్యూల్ ఖరారయింది. కోదండ రామాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కళ్యాణంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా రామయ్యకు రాష్ట్రప్రభుత్వం తరఫున ఆయన పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై సహచర మంత్రులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.

March 29, 2026 / 09:14 AM IST

నీళ్లతో ముఖం కడిగిస్తున్న పోలీసులు

కోనసీమ: జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు “స్టాప్, వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసు యంత్రాంగం అర్ధరాత్రి నిర్వహించారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లను గుర్తించి, వారిని వాహనం దింపి, నీళ్లతో ముఖం కడిగించి వారు పూర్తిగా అప్రమత్తమైన తర్వాతే ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

March 29, 2026 / 09:14 AM IST