• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటికే రాములోరి తలంబ్రాలు!!

SRPT: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల ఇంటికే చేర్చేందుకు కోదాడ ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని డీఎం శ్రీనివాసరావు ఈ రోజు తెలిపారు. తలంబ్రాల బియ్యం కావాల్సిన భక్తులు రూ. 151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ విశిష్ట సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

March 26, 2026 / 05:01 PM IST

ఏపీ మోడల్ స్కూల్లో దరఖాస్తుల ఆహ్వానం

PLD: ఈపూరు ఏపీ మోడల్ స్కూల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ పద్మజ కోరారు. పదవ తరగతి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ఉన్నాయన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

కొండపిలో కార్డన్ చర్చ్ నిర్వహించిన పోలీసులు

ప్రకాశం: కొండపిలో గురువారం పోలీసులు అంబేద్కర్ నగర్‌లో కార్డెన్ చర్చ్ నిర్వహించారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు సీఐ సోమశేఖర్ సర్కిల్లోని ఎస్ఐలతో కలిసి కాలనీలలో సోదాలు నిర్వహించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలా పలుకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

March 26, 2026 / 05:01 PM IST

గురుకులంలో దరఖాస్తులకు ఆహ్వానం

SRD: కంగ్టిలోని తెలంగాణ గిరిజన సీవోఈ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ డీ. విజయ్ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఏప్రిల్ 7లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

కూలీల పెండింగ్ డబ్బులు ఇవ్వాలి: CPM

GDWL: ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించకపోతే కూలీలు మళ్లీ వలస బాట పట్టాల్సి వస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి అన్నారు. బుధవారం ధరూర్ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గత 8 వారాలుగా కూలీ డబ్బులు అందుక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

గ్యాస్ బండ కోసం గంటల తరబడి నిరీక్షణ

MDK: జిల్లా కేంద్రంలో హెచ్పీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఏజెన్సీ లేకపోవడంతో కౌడిపల్లి బ్రాంచ్ పైన, స్థానిక గోదాం పైన ఆధారపడాల్సి వస్తోంది. ఇవాళ గ్యాస్ సిలిండర్ల కోసం వందలాది మంది ఎండలో గంటల తరబడి బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసి తమ కష్టాలు తీర్చాలన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

ముస్లిమ్ చేసిన సేవలు అభినందనీయం

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద పట్టణానికి చెందిన ముస్లిం సమాజానికి చెందిన చోట బాయ్ నల్లాలు బిగించే పనులు చేపట్టడంతో స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. మత భేదాలు లేకుండా సామాజిక బాధ్యతతో ఈ పనులు చేయడం పట్టణంలో ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో చేసిన ఈ సేవకు పట్టణ ప్రజలు అభినందించారు.

March 26, 2026 / 05:01 PM IST

పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

KMR: బీబీపేట్ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, BRS పార్టీ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

‘ఎస్ఐర్ పక్కాగా నిర్వహించాలి’

WNP: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మండలంలో పక్కాగా నిర్వహించాలని తహసీల్దార్ సుగుణ అన్నారు. ఘణపురం మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ లెవెల్ అధికారులకు ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు.

March 26, 2026 / 05:01 PM IST

జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్

E.G: జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించిందనీ, మొత్తం 233 మంది పాత్రికేయులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వైద్య శిబిరం స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం నిర్వహించారు. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం శిబిరాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

March 26, 2026 / 05:00 PM IST

వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శుక్రవారం శ్రీ రామనవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, శని, ఆదివారాల్లో సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి 30న సోమవారం మార్కెట్ యథావిధిగా పునః ప్రారంభం అవుతుందని వెల్లడించారు. కావున రైతులు, వ్యాపారస్థులు, కార్మికులు సహకరించగలరని పేర్కొన్నారు.

March 26, 2026 / 05:00 PM IST

కలెక్టర్‌తో ఎస్టీ కమిషన్ సభ్యుల భేటీ

ATP: అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను ఏపీ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప కలిశారు. జిల్లాలోని గిరిజన తండాల్లో సీసీ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కిలిమంజారో పర్వతం అధిరోహించిన చిన్ని కృష్ణ నాయక్‌కు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. గిరిజన సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

March 26, 2026 / 05:00 PM IST

పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ సన్ ప్రీత్ సింగ్

WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం సంగెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్ పరిధిలోని నేరాలు, రౌడీ షీటర్లు, పెండింగ్ కేసుల వివరాలను తెలుసుకుని, పెండింగ్ కేసులపై విచారణ జరిపి, ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా పనిచేయాలని సూచించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పోలీసులను ఆదేశించారు.

March 26, 2026 / 05:00 PM IST

జేసీకి వినతి పత్రం అందించిన వైసీపీ నాయకులు

NTR: విజయవాడలో జేసీ ఇలాక్కియాకి వైసీపీ నాయకులు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఏ.కొండూరు, మార్కాపురం ప్రాంతాల్లో సీకేడీ తీవ్రత పెరుగుతోందని తెలిపారు. ఏ.కొండూరులో 61.8% మంది బాధితులని, మార్కాపురంలో డయాలసిస్ రోగులు పెరిగారని చెప్పారు. మెడికల్ కాలేజీ పనులు వేగవంతం చేయాలని, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని, తాగునీటి వనరులపై శాస్త్రీయ పరిశీలన చేయాలని కోరారు.

March 26, 2026 / 05:00 PM IST

శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం

TPT: ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి మర్రి రిటైల్ లిమిటెడ్ సంస్థ పేరిట టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ. కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.

March 26, 2026 / 05:00 PM IST