• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి’

E.G: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ (BSP) జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్ర సేను మాట్లాడుతూ క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ లకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

March 26, 2026 / 04:00 PM IST

సీఎం పర్యటనకు విస్తృత సన్నాహాలు

NLR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో జనసేన నాయకులతో గురువారం విస్తృత సన్నాహక సమావేశం జరిగింది. “పేదల సేవలో” కార్యక్రమం ఏర్పాట్లపై 8 మండలాల జనసేన నాయకులతో సమగ్ర చర్చలు జరిపి, ప్రతి అంశాన్ని సమీక్షించారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం నిర్వహించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

March 26, 2026 / 04:00 PM IST

TB నిర్ధారణలో AI సహాయంతో ఎక్స్ రే.!

MDCL: కీసర, రాంపల్లి, మూడుచింతలపల్లి ప్రాంతాల్లో యాక్టివ్ కేస్ ఫైండింగ్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించారు. మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలో టీబీ కేసులను జీరో చేయడమే లక్ష్యంగా ఆరోగ్య శాఖ ముందుకు సాగుతోంది. AI ఆధారిత ఎక్స్‌రే పరీక్షలతో వ్యాధిని తొందరగా గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు PO డాక్టర్ శ్రీదేవి తెలిపారు.

March 26, 2026 / 04:00 PM IST

హాస్టల్‌ను సందర్శించిన SC, ST కమిషన్ సభ్యులు, సబ్ కలెక్టర్

MNCL: బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ SC హాస్టల్‌ను రాష్ట్ర SC,ST కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, సబ్ కలెక్టర్ మనోజ్ గురువారం సందర్శించారు. నూతన బిల్డింగ్ నిర్మించే వరకు ప్రత్యమ్నాయంగా పాత జిఎం ఆఫీస్ బిల్డింగ్‌ను పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కి నివేదిక సమర్పించాలని నిర్ణయించారు.

March 26, 2026 / 04:00 PM IST

సజ్జాపురంలో కిసాన్ గోష్టి

BPT: సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో ఆత్మ ప్రకాశం జిల్లా సౌజన్యంతో, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కిసాన్ గోష్టి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి ARS శాస్త్రవేత్త డా. చి. వరప్రసాద్ రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుకోవాలని సూచించారు. ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్ వినియోగం వల్ల జింక్ లోపాలు నివారించవచ్చన్నారు

March 26, 2026 / 04:00 PM IST

తిరుపతిలో CUB శాఖ ప్రారంభం

TPT: బైరాగిపట్టెడలో సిటీ యూనియన్ బ్యాంక్ (CUB) 936వ శాఖను గురువారం తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న బైరాగిపట్టెడ ప్రాంతంలో ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. సెల్ఫ్ సర్వీస్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రజలకు, వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

March 26, 2026 / 04:00 PM IST

పింఛన్ ఆపేశారంటూ మహిళ ఆందోళన

GNTR: కోయవారిపాలేనికి చెందిన చిన్నం శివమ్మ తన తల్లితో కలిసి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అధికారులు తన పింఛన్‌ను అకారణంగా నిలిపివేశారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. తాను టీడీపీ మద్దతురాలినని, ఓ జనసేన నాయకుడు కక్షకట్టి తనపై ఫిర్యాదులు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫిర్యాదుల వల్లే అధికారులు తన పింఛన్ ఆపేశారని, న్యాయం చేయాలని కోరారు.

March 26, 2026 / 04:00 PM IST

సెకండ్ హాఫ్‌లో కమిన్స్ ఎంట్రీ..!

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ ఇప్పటికే భారత్‌కు చేరుకుని జట్టుతో కలిశాడు. అయితే, గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో IPL 2026 ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం కమిన్స్ SRH మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఏప్రిల్ చివరిలో కమిన్స్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

March 26, 2026 / 03:58 PM IST

‘రైతు బజార్‌లో సమస్యలు పరిష్కరించాలి’

KKD: బస్టాండ్ వద్ద గల రైతు బజార్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏఐకేఎంఎస్, ఐఎఫ్‌టీయూ సంఘాల నాయకత్వంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం రైతులు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వెళ్లి తమ డిమాండ్ల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్‌కు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించిే కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు.

March 26, 2026 / 03:51 PM IST

మామిడి తోటలో మంటలు

CTR: పుంగనూరు మండలం కూరప్పల్లి గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం రైతు మునస్వామికి చెందిన మామిడి తోటలో మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు సిబ్బంది మంటలను ఆర్పేశారు. రూ.20 వేల వరకు పంట నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయారు.

March 26, 2026 / 03:50 PM IST

బస్సు ప్రమాదం.. కేబినెట్ సంతాపం

AP: మార్కాపురం జిల్లా రాయవరం బస్సు ప్రమాదంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. మృతులకు సంతాపం, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపింది. అలాగే వడ్డెర సంఘాలకు ప్రాధాన్యక్రమంలో ఖనిజ లీజుల కేటాయింపులపై చర్చించింది. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీమాఫీ ఆమోదించింది.

March 26, 2026 / 03:50 PM IST

పేద బాలిక చదువు కోసం మానవతా ఆర్థిక చేయూత

ELR: నూజివీడు పట్టణంలో ఓ పేద విద్యార్థిని చదువు కోసం ఫీజు నిమిత్తం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 5 వేల రూపాయలను గురువారం ఆర్థిక సాయంగా అందించారు. సేవా సంస్థ ఛైర్మన్ పీ. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అందరి సహకారంతో పేదలకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. పేదలైన బాలికల చదువు కోసం తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు.

March 26, 2026 / 03:48 PM IST

అభివృద్థి పనులను పరిశీలించిన కలెక్టర్

BHPL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న MRI యంత్రం, డయాలసిస్ కేంద్రం ఏర్పాటు పనులను గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మారై ఏర్పాటు పనులను నిరంతరం పర్యవేక్షించడానికి ఆర్డీవోను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఎమ్మారై యంత్రం ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు.

March 26, 2026 / 03:48 PM IST

మహిళల భద్రత కోసం శక్తి యాప్

W.G: భీమవరం కలెక్టర్ కార్యాలయంలోని ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–2013’ నివారణ, నిషేధం, దిద్దుబాటు అంశాలపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రతి ఒక్క మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 26, 2026 / 03:46 PM IST

నర్సాపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

NRML: నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌ను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, సేవల నాణ్యతను పెంచాలని అధికారులకు సూచించారు.

March 26, 2026 / 03:44 PM IST