• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

ADB: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్, బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జ్ రాజర్షిషా అన్నారు. గురువారం పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర ప్రధాన కార్యాలయంలో 98వ మహాజన సభ కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బ్యాంకు నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

March 26, 2026 / 03:07 PM IST

‘కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం’

సత్యసాయి: ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. మంత్రి సత్య కుమార్ ఆదేశాల మేరకు గురువారం 4వ మాస్టర్ తనిఖీలో మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న కాలువ పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.

March 26, 2026 / 03:07 PM IST

‘మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు’

ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద గురువారం పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. SI బొజ్జి రావు ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని SI హెచ్చరించారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.

March 26, 2026 / 03:07 PM IST

బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నికల నిర్వహణ

MDK: మెదక్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనుటకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎన్నికకు బ్యాలెట్ పద్ధతిన ఎన్నికల నిర్వహించారు. న్యాయవాదులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది.

March 26, 2026 / 03:06 PM IST

హుస్నాబాద్‌లో విద్యుత్ కార్మికుల ధర్నా..!

SDPT: హుస్నాబాద్‌లో విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ఆర్టిసన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సుమారు 19 వేల మంది కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ పదోన్నతులు కల్పించాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే నెల 8లోపు రాష్ట్రవ్యాప్తంగా మెరుపు సమ్మె చేపడతామని హెచ్చరించారు.

March 26, 2026 / 03:06 PM IST

‘గ్లోబల్ స్టీల్ హబ్‌‌గా ఏపీ మారుతుంది’

KRNL: ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి దక్కనుందని జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ఇవాళ తెలిపారు. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో 5,475 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పడనుండగా, లక్ష మందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రాజెక్ట్‌తో రాష్ట్రం గ్లోబల్ స్టీల్ హబ్‌గా మారుతుందని ఆమె పేర్కొన్నారు.

March 26, 2026 / 03:05 PM IST

దేవాలయానికి వంట సామాగ్రి వితరణ

MBNR: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న వీర హనుమాన్ దేవాలయానికి గురువారం ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ వంటసామాగ్రి వితరణ చేశారు. ఆ సామాగ్రిలతో దాదాపు 2000 మంది భక్తులకు అన్నదానం చేయడానికి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

March 26, 2026 / 03:05 PM IST

‘వాటర్ ప్లాంట్లలో శుభ్రత ప్రమాణాలు పాటించాలి’

NRML: వాటర్ ప్లాంట్లలో శుభ్రత ప్రమాణాలు పాటించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ అన్నారు. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని పలు వాటర్ ప్లాంట్లలో తనిఖీలను నిర్వహించారు. అపరిశుభ్రత, కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్ యజమానులకు జరిమానాలను విధించారు. వీరి వెంట మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

March 26, 2026 / 03:05 PM IST

మహాధర్నా పోస్టర్‌లు ఆవిష్కరణ

KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నేడు మహా ధర్నా పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనిల్, విక్రం, మహేష్, అనిత, హరీష, పరమేశ్వరి, నరేష్ ఉన్నారు

March 26, 2026 / 03:02 PM IST

లెక్కలు చెప్పాల్సిందే.. ఈనెల 29 వరకే ఛాన్స్

KNR: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 29 లోపు తమ ఖర్చుల లెక్కలను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సిందేనని అధికారులు తెలిపారు. నిర్ణీత గడువులో లెక్కలు ఇవ్వనట్లయితే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోవాల్సి ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు తమ పదవులను కోల్పోయే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

March 26, 2026 / 03:02 PM IST

32 మందికి స్కౌట్ విద్యార్థులకు పరీక్షా

ELR: జంగారెడ్డిగూడెం బాలుర జడ్పీ హైస్కూల్లో గురువారం స్కౌట్స్ & గైడ్స్ విద్యార్థులు 32 మందికి స్కౌట్ శిక్షణ అనంతరం ప్రవేశ పరీక్ష పాఠశాలలో నిర్వహించారు. పర్యవేక్షులుగా జిల్లా ట్రైనింగ్ కమిషనర్ బిరుదుగడ్డ నాగేశ్వరరావు, HM సోమశేఖర్ పాల్గొని విద్యార్థులకు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించారు. వారికి తగిన సూచనలు సలహాలు అందజేశారు.

March 26, 2026 / 03:01 PM IST

హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా పర్యటనకు గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ శ్రీ సుధా విచ్చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ హైకోర్టు న్యాయమూర్తిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మర్యాదపూర్వకంగా కలిశారు. హైకోర్టు న్యాయమూర్తితో జిల్లా కలెక్టర్ పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి పాల్గొన్నారు.

March 26, 2026 / 03:01 PM IST

‘చిన్నారుల‌కు పౌష్టికాహారం అందించాలి’

NLG: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆహ్లాద‌క‌ర వాతావరణం కల్పించి చిన్నారులు అక్షరాలను గుర్తుపట్టేలా తీర్చిదిద్దాలని నల్ల‌గొండ డిప్యూటీ మేయర్ ఆలీ అన్నారు. ఇవ్వాళ నల్గొండ పట్టణంలోని 46వ వార్డు పరిధిలోని రాజ్‌న‌గ‌ర్ అంగన్‌వాడీ కేంద్రంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన ఏ‌ఎల్‌ఎం‌సీ సమావేశ...

March 26, 2026 / 03:01 PM IST

సైన్స్ కళాశాలకు ప్రిన్సిపల్ నియమించాలి: ఏబీవీపీ

NZB: తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించబడిన సైన్స్ కళాశాలకు ప్రిన్సిపల్‌ను నియమించాలని ఏబీవీపీ వర్సిటీ సంయుక్త కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సైన్స్ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. మౌలిక వసతులు, సెక్యూరిటీ సీసీ కెమెరాలతో పాటు సిబ్బందిని నియమించాలని కోరారు.

March 26, 2026 / 03:01 PM IST

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్సె

VKB: కుల్కచర్ల మండల ప్రజలు ఈ నెల 28న నిర్వహించే ‘జాతీయ లోక్ అదాలత్’ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై రమేష్ కుమార్ కోరారు. మైనర్ క్రిమినల్, కుటుంబ, సివిల్, ఇతర వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశమన్నారు. రాజీతో సమయం, వ్యయం తగ్గడమే కాక ఇరుపక్షాల మధ్య శాంతి, సఖ్యత నెలకొంటుందని తెలిపారు.

March 26, 2026 / 03:00 PM IST