NZB: తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించబడిన సైన్స్ కళాశాలకు ప్రిన్సిపల్ను నియమించాలని ఏబీవీపీ వర్సిటీ సంయుక్త కార్యదర్శి అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సైన్స్ కళాశాలలో మీడియాతో మాట్లాడారు. మౌలిక వసతులు, సెక్యూరిటీ సీసీ కెమెరాలతో పాటు సిబ్బందిని నియమించాలని కోరారు.