GNTR: ఏపీలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు వదంతులు నమ్మొద్దని కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ఎల్పీజీ నుంచి పీఎన్జీ గ్యాస్ వాడకానికి మారే వినియోగదారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. వీరికి కూడా ‘దీపం’ పథకం కింద సబ్సిడీని వర్తింపజేస్తామని తెలిపారు.