GDWL: గట్టు మండలం బల్గెర గ్రామ శివారులో గురువారం రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన దాదాపు ఐదు టిప్పర్ల ఇసుక డంపులను SI శేఖర్, MRO విజయ్ కుమార్ గుర్తించారు. అనంతరం సీజ్ చేసి సంబంధిత నిందితులపై కేసు నమోదు చేశారు.
BHPL: జిల్లా కేంద్రంలో CPI (ML) లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ పాల్గొన్నారు. CPI (ML)జిల్లా కమిటీ సభ్యుడిగా ఆత్కూరి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బందు క్రాంతి, బందు సుజాత, స్వాతి తదితరులు ఉన్నారు.
యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు వెళ్లే సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారడంతో బాస్మతీ బియ్యం ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. సుమారు 10 లక్షల టన్నుల బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. దీనికి తోడు షిప్పింగ్ కంపెనీలు ‘వార్-రిస్క్ సర్ ఛార్జ్’ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇది ఎగుమతిదారులపై పెను భారంగా మారింది.
BDK: మణుగూరు పట్టణంలో MJPTBC బాయ్స్ రాజీవ్ గాంధీ నగర్ లో వైద్యులు ఇవాళ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్‌లో భాగంగా పిల్లకు టీబీ లక్షణాల వ్యాప్తి, నివారణ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. HPV వ్యాక్సిన్‌ను 15 సంవత్సరాల ఆడ పిల్లలు అందరూ తీసుకోవాలని డా. సునీల్ సూచించారు.
ADB: ఇచ్చోడ మండలంతో పాటు పరిసర ప్రాంతాలకు ఈనెల 28 నుంచి 30 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాడేగాం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద నిర్వహణ పనులు, సీతాగొంది వద్ద పైపులైన్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలగనుంది. మూడు రోజుల పాటు నీటి సరఫరా ఉండదని, ప్రజలు గమనించి సహకరించాలని భగీరథ నిర్వహణాధికారి తెలిపారు.
KMM: మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం సీపీఎం ఆధ్వర్యంలో చింతకాని మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి మొక్కజొన్న గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.
SDPT: జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపోచమ్మ గ్రామంలో ఐదు నూతన సీసీ కెమెరాలను గజ్వేల్ రూరల్ సీఐ డీ. రవి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాల నియంత్రణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో SI జె.కృష్ణా రెడ్డి, సర్పంచ్ సంధ్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.
సత్యసాయి: జిల్లా SP సతీష్ కుమార్ ఆదేశాల మేరకు శక్తి టీమ్ బృందాలు మహిళలు, బాలికల భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయి. ఆపద సమయంలో శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని గురువారం నిర్వహించిన సదస్సులో పోలీసులు వివరించారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలు, గృహ హింసపై అవగాహన కల్పిస్తూ డయల్ 100, 112, 181 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని రూ.ఐదు భోజనం కేంద్రంలో పరిస్థితులపై హిట్ టీవి యాప్ వరుస కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి మాజీ మంత్రి శ్రీనివాస్ కూడా స్పందించారు. తాజాగా దీనిని స్థానికులు పట్టణ మేయర్, డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యపై వారు సానుకూలంగా స్పందించి వెంటనే షెడ్‌ని నిర్మించారు. ఇక నుంచి ప్రజలకు అందులో మధ్యాహ్న భోజనం అందజేయనున్నారు.
AKP: జిల్లాలో అభివృద్ధికి బీజం వేసింది దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. గురువారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కరువు నివారణకు ఎస్ఈజెడ్‌ను వైఎస్ఆర్ తీసుకువచ్చిన విషయాన్ని స్థానిక టీడీపీ నేతలు తెలుసుకోవాలన్నారు. అలాగే, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదిత్యా మిట్టల్‌ను జగన్ ఆహ్వానించారన్నారు.
SKLM: మందసలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్వచ్చ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వాహనాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రతే రాష్ట్ర అభివృద్ధికి మూలం అని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బ్లడ్ షుగర్ కంట్రోల్‌కు ఆపిల్ పండు బాగా ఉపయోగపడుతుంది. ఒక మీడియం ఆపిల్‌లో సుమారు 25 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నా.. ఇందులో ఫైబర్ దాదాపు 4 గ్రాములు ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల షుగర్ రక్తంలోకి నెమ్మదిగా వెళ్తుంది. అందుకే ఆపిల్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు రోజుకు 1 మీడియం ఆపిల్ తీసుకోవచ్చు. తొక్కతో పాటు నమిలి తింటే ఇంకా మంచిది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెట్రోల్ కొరత ఏర్పడింది. నిన్నటి నుంచి బైక్‌లకు కేవలం లీటరు పెట్రోలు మాత్రమే పోస్తున్నారు. అదికూడా లీటరుకు 10 రూపాయల ఎక్కువగా వసూలు చేస్తున్నారని వినియోగదారులు చెబుతున్నారు. పెట్రోల్ కోసం వినియోగదారులు క్యూ లైన్లలో అర్ధ గంట ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
BHNG: ప్రభుత్వం చేపట్టిన 99-Days Action Plan ‘ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈరోజు ఆలేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో(సూపరింటెండెంట్ స్వప్న రాథోడ్, డాక్టర్లు సిబ్బంది మరియు ప్రజలకు)ఫైర్ సేఫ్టీ మీద స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అబ్దుల్ హమీద్ అవగాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా ఆర్పాలి అవగాహన కల్పించారు.
PDPL: జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు ఈ నెల 31న పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి సురేష్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఉదయం 10 గంటలకు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.