SDPT: చేర్యాల పట్టణ పరిధిలోని జాతీయ రహదారి, కాలనీలు, దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన 26 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. నేరాల నివారణ, కేసుల ఛేదనలో ఇవి పోలీసులకు మూడో కంటిగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.
PLD: వెల్దుర్తి మండలంలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అర్జీలు స్వీకరించారు. సంబంధిత సమస్యలపై అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
SS: తాడిమర్రి మండలం గూడ్దంపల్లిలో ఆలయ పూజారి శివయ్యపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని నియోజకవర్గ బీజేపే ఇంఛార్జ్ హరీష్ బాబు మండిపడ్డారు. గురువారం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
BDK: ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా, రాజీ పడదగ్గ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఎస్సై కోరారు. ఈ నెల 28న జరగనున్న లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూలూరుపాడు ఎస్సై రవి గురువారం పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ఒక మంచి అవకాశం లభించింది.
కామారెడ్డి: మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నేడు బిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి మహిళ డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగారెడ్డి, IKP ఏపీఎం సాయిలు, డ్వాక్రా మహిళలు ఉన్నారు.
కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు తరలిరావాలని కోరుతూ జిల్లా ఇంఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆహ్వానించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రిని కలుసుకుని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక, ప్రసాదం అందజేశారు.
పశ్చిమాసియాలో యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తలతో హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులు భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల(EV) వైపు మళ్లుతున్నారు. షోరూమ్‌ల వద్ద వినియోగదారులు తమ గోడు వెళ్లగక్కుతున్నారు. దీంతో గత 2 రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు.
KDP: పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రింగ్ రోడ్డు నుంచి రంగనాథస్వామి రింగ్ రోడ్డు, శిల్పారామం వెళ్లే రోడ్డుకు ఇరువైపులా విస్తరించిన వృక్షాలు ఒక పచ్చని తోరణాలతో ఏర్పడి వాహనదారులకు చల్లని నీడను ఇస్తున్నాయి. మండు వేసవిలో పచ్చని ఆకులతో చిగురించి పచ్చదనాన్ని పంచుతున్నాయి. మహిళలు, పురుషులు వాకింగ్ చేస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
NLR: దడదర్తి మండలం కాట్రాయపాడులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎస్సై జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు చేశారు. నిల్వ చేసిన టపాసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SRD: కంగ్టి శ్రీ రామాలయంలో శుక్రవారం శ్రీ రాములోరి తొట్టెల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఉగాది నుంచి ఇక్కడ శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయ ప్రకారంగా గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీరాముడి జన్మఉత్సవం నిర్వహించారు. అనంతరం రాముడి తొట్టెలలో పూలు గులాలు వేసి, బాల రాముడిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
SS: సోమందేపల్లి మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్‌ను యాంటీ కరప్షన్ ఫోరం సభ్యులు గురువారం సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో సన్మానించారు. సత్యసాయి జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ కరప్షన్ ఫోరం అధ్యక్షులు నరసింహామూర్తి ఆధ్వర్యంలో సభ్యులు ఎస్సైను కలిసి శాలువా కప్పి, పూల బొకే అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాగభూషణ్ రెడ్డి పాల్గొన్నారు.
MDCL: బోడుప్పల్ పరిధి వెంకటేశ్వర నగర్, ప్రధాన రహదారి దుకాణాల్లో కోడిగుడ్ల ధరలు మరింత తగ్గుముఖం పట్టినట్లు అక్కడ వ్యాపారులు తెలిపారు. హోల్ సేల్ వ్యాపారులు డైరెక్ట్ వివిధ వాహనాలలో వచ్చి 30 గుడ్లు కేవలం రూ.70లకే విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లి కోడిగుడ్లు కొనుగోలు చేస్తున్నారు.
SRPT: నడిగూడెం మండల కేంద్రానికి చెందిన విశ్రాంత కార్యాలయ సహాయకులు (ఆఫీసు సబార్డినేట్) నరసింహా ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల స్థానిక ప్రముఖులు, తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. నరసింహారావు తన సుదీర్ఘ సర్వీసులో నిజాయితీ గల వ్యక్తిగా గుర్తింపు పొందారని వారు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
BHNG: యాదగిరిగుట్ట మండలంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పర్యటించారు. సైదాపూర్ గ్రామంలో పర్యటించి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని నివాసానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే సైదపురం చెరువు నుంచి అలుగు పారుతుండటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
TPT: పెళ్లకూరు (M) దిగువ చావలి గ్రామపంచాయతీలో టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళల అవగాహన ర్యాలీ నిర్వహించారు. “టీబీ నివారణ మా లక్ష్యం-క్షయ వ్యాధి రహిత రాష్ట్రమే మా ధ్యేయం” అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ప్రతి పౌరుడు వ్యాధి బారిన పడకుండా కాపాడడం మన బాధ్యత అని పంచాయతీ కార్యదర్శి మాధవి, ఏఎన్ఎం శోభన తెలిపారు.