HYD: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 5వ వార్డు శ్రీపురి కాలనీలో పార్క్‌ను కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పునర్నిర్మించారు. ఈ పార్క్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంతో గురువారం ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరయ్యారు. అన్ని వసతులతో పార్క్‌ను పునర్నిర్మించడంతో కాలనీవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
MNCL: ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని బెల్లంపల్లి MLA వినోద్ స్పష్టం చేశారు. ఇవాళ పట్టణంలోని అశోక్ నగర్‌లో నివాసం ఉంటున్న దివ్యాంగురాలిని స్వయంగా కలిసి మాట్లాడారు. తన ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఆమె MLAకు వివరించగా, సానుకూలంగా స్పందించిన MLA తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించడమే తన కర్తవ్యం అన్నారు.
తన భర్త నిక్ జోనస్‌తో విడాకులు తీసుకోబోతున్నట్లు వస్తోన్న వార్తలపై ప్రియాంక చోప్రా ఘాటుగా స్పందించింది. భిన్న దేశాలు, మతాలు, వయసు తేడా వల్ల కొందరు తమ బంధాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని మండిపడింది. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోవడం మానేశానని, ఎనిమిదేళ్లుగా నిక్ జోనస్‌తో తన బంధం బలంగా ఉందని స్పష్టం చేస్తూ రూమర్లకు చెక్ పెట్టింది
BPT: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 88 కేజీల విభాగంలో చీరాలకు చెందిన ప్రేమ్ సాగర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. రెండు ట్రయల్స్‌లో అగ్రస్థానంలో నిలిచి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. రాయ్‌పూర్‌లో జరిగే ఫైనల్ పోటీలకు సిద్ధమవుతున్నాడు. అతని తల్లి స్వాతి స్థానికంగా రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు.
NDL: ప్యాపిలి మండలం కల్చట్ల గ్రామంలో అనారోగ్యంతో ఉన్న సీనియర్ వైసీపీ నాయకుడు బాలా అంజిని మాజీ మంత్రి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి గురువారం పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలా అంజి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక నాయకులు వెంకటేశ్వర రెడ్డి, రజినీకాంత్ రెడ్డి ఉన్నారు.
అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో రూ. 40 లక్షలతో నిర్మించిన సచివాలయం-1 భవనం ఏడేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. చిన్నపాటి విద్యుత్ పనులు మినహా అన్నీ పూర్తయినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో అద్దె భవనాల్లో సేవలు నిర్వహిస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు: నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు బీసీ సంక్షేమ శాఖలో పదవీ విరమణ చేసిన వసతి గృహ సంక్షేమాధికారి కేటీ బాబు, రమాదేవి దంపతులు వస్త్రాలను పంపిణీ చేశారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలను పురస్కరించుకుని ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.
W.G: ఆకివీడు మండలం మందపాడులో పలు అభివృద్ధి పనులను ఉండి MLA రఘురామరాజు గురువారం ప్రారంభించారు. PWS స్కీం కింద రూ. 9.5 లక్షలతో నిర్మించిన 0.5 MLD మైక్రో ఫిల్టర్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఉప్పుటేరు వద్ద నూతనంగా నిర్మించిన రేవును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనుమూరి బాపిరాజు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
MDCL: చిలుకానగర్ నుంచి చర్లపల్లి వరకు RTC బస్సుల కోసం ప్రజల డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు నేరుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో మారాల్సి రావడం వల్ల సమయం, ఖర్చు పెరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్‌లో డైరెక్ట్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
BDK: ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాదులో నిర్వహించు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఇవాళ గుండాల మండల కేంద్రంలో పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ చిరంజీవి మాట్లాడుతూ.. అరుణోదయ 1974 లో ఆవిర్భావించిందని,52 సంవత్సరాల సుధీర్గ ప్రయాణంలో దోపిడీ, పీడన,అణిచివెతలకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఉందని కొనియాడారు.
TPT: తిరుపతి SVU ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 28వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 560 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
KDP: లింగాల(M)లోని గ్రామాల్లో వంట గ్యాస్ కొరత కారణంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లింగాల మండలంలో సుమారు 500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పులివెందులలో ఓ గ్యాస్ ఏజెన్సీ వారానికోసారి ప్రత్యేక వాహనం ద్వారా గ్యాస్ సిలిండర్లను అందించేది. వారం రోజుల క్రితం సిలిండర్లు బుక్ చేసుకుని ఓటీపీలు వచ్చినప్పటికీ గ్రామాలకు గ్యాస్ సిలిండర్లను అందించలేదని వారు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
NTR: సైడ్ డ్రైనేజీ శుభ్రం చేయడంలో VMC అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పటమట హై స్కూల్ రోడ్డులోని సైడ్ డ్రైనేజీలు అధ్వానంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో దోమలు బెడద విపరీతంగా ఉందని వాపోతున్నారు. లార్వా నాసిన్ మందులు పిచికారి చేయడం కూడా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గ్యాస్ కొరత నేపథ్యంలో హోటల్, రెస్టారెంట్ బిల్లులపై LPG/ అదనపు ఛార్జీలు వేస్తే.. వాటిని తొలగించమని కస్టమర్లు కోరవచ్చు. వాటి యాజమాన్యాలు వినకపోతే 1915 కు కాల్/ NCH యాప్ ద్వారా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌పై ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారుల కమిషన్‌కు ఈ-జాగృతి పోర్టల్ ద్వారా కూడా ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. జిల్లా కలెక్టర్/ CCPAకి కంప్లైంట్ సమర్పించవచ్చు.
JN: పోలీస్ శాఖలో నియామకాలు, ప్రమోషన్లు, సిబ్బంది ఆరోగ్య భద్రత అంశాలపై జనగామ MLA డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా నిలదీశారు. ఇవాళ అసెంబ్లీలో MLA మాట్లాడుతూ.. 17 లక్షల మంది అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని, గత ప్రభుత్వం 45 వేల నియామకాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. వెంటనే కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు.