• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

9.45 లక్షల మందికి ఉచిత వైద్యం: మంత్రి

TG: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి మాత్రమే సేవలు అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులను భారీగా పెంచిందన్నారు.

March 26, 2026 / 02:30 PM IST

పేరుకు పట్నం..కనీసం రోడ్లు లేవు సార్..!

MDCL: పేరుకే పట్నం తప్ప తమ ప్రాంతంలో కనీసం రోడ్లు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్ గిరి అన్నపూర్ణ సొసైటీ పరిసరాల్లో మట్టిరోడ్లు బురదమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. స్కూల్ పిల్లలు, వృద్ధులు వెళ్లడమే కష్టంగా ఉందన్నారు.

March 26, 2026 / 02:30 PM IST

కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

MBNR: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రాయితీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కుష్బూ గుప్తా కోరారు. రూ.లక్ష లోపు రుణాలకు 90%, రూ.3 లక్షల వరకు 70%, రూ.3-7 లక్షల లోపు రుణాలకు 60% సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

March 26, 2026 / 02:30 PM IST

నారా లోకేష్‌ను కలిసిన నిమ్మల కిష్టప్ప

సత్యసాయి: TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గురువారం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడు నిమ్మల అంబిరీష్‌తో కలిసి అమరావతిలో మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా వినతులు అందజేశారు.

March 26, 2026 / 02:30 PM IST

OTTలోకి ‘మృత్యుంజయ్’.. ఎప్పుడంటే?

శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.

March 26, 2026 / 02:30 PM IST

తిమ్మాయపాలెంలో ఇంటి పన్ను 100 శాతం వసూళ్లు

BPT: అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామపంచాయతీలో గురువారం హౌస్ టాక్స్ వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈరోజు రూ.11,250 హౌస్ టాక్స్ వసూలై, మొత్తం 31 అసెస్మెంట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చలివేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.

March 26, 2026 / 02:28 PM IST

ప్రజా దర్బార్ కార్యక్రమానికి 75 అర్జీలు

NTR: జి.కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రజల సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 75 అర్జీలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించారు. గ్రామాభివృద్ధికి రహదారులు, వంతెనలు సహా పలు పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

March 26, 2026 / 02:27 PM IST

బీఆర్ఎస్ మండల కన్వీనర్‌గా ప్రవీణ్

HNK: బీఆర్ఎస్ ధర్మసాగర్ మండల కన్వీనర్‌గా గుర్రపు ప్రవీణ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. మండలంలో పార్టీ అభివృద్ధికి కృషిచేస్తానని, కార్యకర్తల అందరిని ఏకతాటిపైకి తీసుకువస్తానని చెప్పారు.

March 26, 2026 / 02:25 PM IST

IPLకు ఆంధ్ర ప్లేయర్ దూరం

IPL-2026 ముందు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టులో కీల‌క మార్పు చోటు చేసుకుంది. ఆ జట్టు పేసర్ యర్రా పృథ్వీరాజ్ గాయం కార‌ణంగా మెగాటోర్నీకి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో కుల్వంత్ ఖేజ్రోలియాను జట్టులోకి తీసుకుంది. కాగా, APకి చెందిన పృథ్వీరాజ్‌ను గతేడాది జరిగిన వేలంలో రూ. 30 లక్షలకు GT సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

March 26, 2026 / 02:21 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన.. హెల్మెట్‌ల పంపిణీ

CTR: మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

March 26, 2026 / 02:20 PM IST

TB పేషెంట్లకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

HYD: తార్నాక, ఉప్పల్ ప్రాంతాలకు చెందిన TB పేషంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. క్షయ వ్యాధి వచ్చిన వారు బలమైన పౌష్టిక ఆహారం తినడం అత్యంత కీలకమైన అంశంగా PO డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు ఒక కోడిగుడ్డు తీసుకోవాలని పేషంట్లకు సూచించారు. TB స్పెషల్ యూనిట్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

March 26, 2026 / 02:20 PM IST

బస్సు ప్రమాదం.. పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు అందుతున్న వైద్యసహాయాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.  

March 26, 2026 / 02:20 PM IST

కోమట్లగూడెంలో శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు

MHBD: శ్రీరామనవమి వేడుకల సందర్బంగా గంగారం మండలం కోమాట్లగూడెం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపడుచులందరూ కలిసి సంప్రదాయబద్ధంగా తలంబ్రాల బియ్యం సిద్ధంచేశారు. పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం.. మహిళలందరూ కలిసి రోకళ్లతో పసుపు దంచి, ఆ పసుపును బియ్యంలో కలిపారు.

March 26, 2026 / 02:20 PM IST

ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ ట్రాఫిక్ పోలీసులు ఆదిత్య కళాశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం, అతివేగ నియంత్రణ వంటి అంశాలపై సూచనలు చేశారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

March 26, 2026 / 02:20 PM IST

రేపు మాంసం దుకాణాలు బంద్

VSP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ పరిధిలోని మాంసం దుకాణాలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. నగరంలో మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వి నరేష్ కుమార్ తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 26, 2026 / 02:19 PM IST