• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి: ఎమ్మెల్యే

NGKL: తెలంగాణ శాసనసభ సమావేశాల్లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తన నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సాగునీటి వనరుల పెంపుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు కేటాయించాలని విన్నవించారు.

March 26, 2026 / 04:30 PM IST

భోజన షెడ్డును ప్రారంభించిన మేయర్

MBNR: జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర ఐదు రూపాయల భోజనం షెడ్‌ను మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు ఆహారం వడ్డించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎంతోమంది కార్మికులు, పేద ప్రజలు ఉపాధి కోసం వచ్చి మధ్యాహ్న భోజనం తీసుకోలేని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

March 26, 2026 / 04:30 PM IST

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్

SRD: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ప్రావీణ్య గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డిజిటల్ ప్రొఫైల్ నమోదు, డేటా ఎంట్రీ తదితర వివరాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

March 26, 2026 / 04:30 PM IST

GST సవరణ బిల్లుకు శాసనసభ అమోదం

TG: GST సవరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది. సేల్స్ టాక్స్ కమిషనర్ పోస్టును చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌గా మార్పు చేసింది. అలాగే అదనపు కమిషనర్ (గ్రేడ్-1) పోస్టును స్టేట్ టాక్స్ కమిషనర్‌గా మార్చుతూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. కేంద్రం, రాష్ట్రంలోని శాఖాధిపతుల మధ్య హోదాలో తేడాలు ఉండటం వల్ల వీటన్నింటిని యూనిఫామ్ చేసేందుకు ఈ చట్ట సవరణ చేసింది.

March 26, 2026 / 04:29 PM IST

‘రాజకీయ ఉనికి కోసం బీఆర్ఎస్ పాకులాట’

SDPT: సిద్దిపేటలో గురువారం నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ బీఆర్ఎస్ నాయకులపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కేవలం తమ రాజకీయ ఉనికి కోసమే పాకులాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎమ్మెల్యే హరీష్ రావు గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు. సిద్దిపేటలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

March 26, 2026 / 04:29 PM IST

రథోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

KRNL: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైసీపీ ఎమ్మిగనూరు ఇన్‌ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి, డీఎస్పీకి ఇవాళ అందజేశారు. రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసు శాఖ సహకారం అందించాలన్నారు.

March 26, 2026 / 04:27 PM IST

‘ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలి’

AP: కేబినెట్ భేటీకి ముందు మంత్రి లోకేష్ మిగతా మంత్రులతో సమావేశమయ్యారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగలా చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలని, సీనియర్ నేతలను సన్మానించి వారితో మంత్రులు, MLAలు కలిసి భోజనం చేయాలన్నారు. అలాగే పింఛన్ అందేలా చర్యలు తీసుకుందామని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు.

March 26, 2026 / 04:27 PM IST

పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం

KNR: శంకరపట్నం మండలం ఎరడపల్లి అంగన్వాడీ కేంద్రంలో ICDS సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రజిత హాజరై ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పథకాలు, అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం, 0-5 ఏళ్ల పిల్లల బరువుల ప్రాముఖ్యతపై సూపర్వైజర్ వివరించారు.

March 26, 2026 / 04:25 PM IST

రాములోరి సన్నిధిలో ఎమ్మెల్యే ముప్పిడి

E.G: భద్రాచలం శ్రీ సీతారాముల వారిని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు పాదయాత్రగా వచ్చిన భక్తులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కును చెల్లించుకున్నాను. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు ఉన్నారు.

March 26, 2026 / 04:24 PM IST

వంట గ్యాస్ ఎఫెక్ట్.. కర్రీ పాయింట్లకు గిరాకీ

W.G: యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో ఆకివీడు ప్రజలు కర్రీ పాయింట్ల బాటపట్టారు. వండుకునే భారం తగ్గుతుందని వినియోగదారులు భావిస్తుండటంతో కర్రీ పాయింట్లకు క్యూ కడుతున్నారు. గ్యాస్ ధరల ప్రభావంతో నిర్వాహకులు సైతం కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు. వెజ్ కర్రీపై రూ. 10, నాన్ వెజ్‌పై రూ. 20 వరకు ధరలు పెంచారు.

March 26, 2026 / 04:21 PM IST

ఈతకి వెళ్లి వ్యక్తి మృతి

KDP: గోపవరం(మం) పెద్ద గోపవరం ఎస్సీ కాలనీ వద్ద బావిలోకి ఈతకు వెళ్లిన మల్లేశ్(36) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయారు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే అగ్నిమాపక ఇంఛార్జ్ చంద్రుడు వారి సిబ్బందితో కలిసి 3 గంటలపాటు శ్రమించి బావిలో ఉన్న శవాన్ని బయటికి తీశారు. విషయం తెలుసుకున్న గోపవరం SI రంగారావు విచారణ చేపట్టారు.

March 26, 2026 / 04:20 PM IST

ఏపీలో ఇంధన కొరత లేదు: మంత్రి నాదెండ్ల

GNTR: ఏపీలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు వదంతులు నమ్మొద్దని కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ఎల్పీజీ నుంచి పీఎన్జీ గ్యాస్ వాడకానికి మారే వినియోగదారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. వీరికి కూడా ‘దీపం’ పథకం కింద సబ్సిడీని వర్తింపజేస్తామని తెలిపారు.

March 26, 2026 / 04:20 PM IST

వరంగల్ మార్కెట్‌లో చిరుదాన్యాల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి గురువారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. పత్తి ధర క్వింటాకి రూ.7,500, మక్కలు(బిల్టీ)కి రూ.2,100 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయ రూ.8,390, పచ్చి పల్లికాయ రూ.4,900 ధర పలికాయి. సింగల్ పట్టి రకం మిర్చి రూ.33 వేలు, టమాటా మిర్చి రూ.37 వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.

March 26, 2026 / 04:19 PM IST

పంజాబ్ కింగ్స్ ప్రత్యేక పూజలు

IPL- 2026 సీజన్ ఆరంభానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించింది. ఇందులో హెడ్ కోచ్ రికీ పాంటింగ్, అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడిన్‌తో పాటు ఇతర కోచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

March 26, 2026 / 04:19 PM IST

శ్రీశైలంలో ఘనంగా స్వర్ణ రథోత్సవం

NLR: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైలక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు గురువారం స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో శ్రీశైల దేవస్థానం బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు రథోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా చేపట్టారు.

March 26, 2026 / 04:15 PM IST