• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉన్నత లక్ష్యాలతోనే విజయాలు: ఎస్పీ

SRPT: చివ్వెంల మండలం దురాజుపల్లి ఎంఎస్ఆర్ స్కూల్‌లో నిర్వహించిన ‘అరైవ్-అలైవ్’ సదస్సులో ఎస్పీ నరసింహ పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని కోరారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు.

March 26, 2026 / 04:03 PM IST

పేద విద్యార్థికి స్కూల్ ఫీజు అందజేత

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన జోగు ప్రణీత కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఆమె తండ్రి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న ఓ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దారమొని గణేష్ గురువారం స్కూల్ యజమాన్యానికి రూ. 15 వేల ఫీజు చెల్లించారు. కార్యక్రమంలో తోటపల్లి గ్రామ ఉప సర్పంచ్ భీమయ్య, జోగు సత్యనారాయణ పాల్గొన్నారు.

March 26, 2026 / 04:02 PM IST

జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు: కలెక్టర్

GDWL: జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పైప్‌లైన్లు, మోటార్లకు మరమ్మతులు పూర్తి చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘వాటర్ ఇన్‌స్పెక్టర్ టీములను’ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జిల్లావ్యాప్తంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

March 26, 2026 / 04:02 PM IST

ఫెర్రర్ కుటుంబంతో ఎమ్మెల్యే భేటీ

ATP: కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి FCRA అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అనంతపురంలో ఫెర్రర్ కుటుంబాన్ని ఆత్మీయంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి ఫలితంగా ఈ రెన్యూవల్ లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడాదిగా ఎదుర్కొన్న సంక్షోభం, ఐదు దశాబ్దాల సేవా ప్రయాణంపై అన్నే ఫెర్రర్, విశాల ఫెర్రర్‌తో సునీత చర్చించారు.

March 26, 2026 / 04:02 PM IST

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ముగిసిన విచారణ

TG: మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించారు. పార్టీలో డ్రగ్స్, కాల్పులపై ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలువురు డ్రగ్స్ పెడ్రర్లకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం శంషాబాద్ PSలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టుకు తరలించారు.

March 26, 2026 / 04:02 PM IST

కురవి ఆలయ అభివృద్ధికి మంత్రికి వినతి

MHBD: కురవి వీరభద్రస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని పురోహితులు నాగేందర్, స్థానిక నేతలు మంత్రి కొండా సురేఖను కోరారు. గురువారం మంత్రిని హైదరాబాద్ కలిసి వినతిపత్రం అందజేశారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని, ఆలయాన్ని ఆధునీకరించాలని విన్నవించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు.

March 26, 2026 / 04:02 PM IST

హత్యాయత్నం కేసులో జైలు శిక్ష విధింపు: SP

MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి పర్యవేక్షణలో సాగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితులకు కోర్టు నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2023లో చన్నారెడ్డిపల్లిలో భూ వివాదం నేపథ్యంలో చెన్నయ్యపై దాడికి పాల్పడిన వెంకటయ్య, శ్రీను, మల్లేష్‌లను దోషులుగా నిర్ధారిస్తూ జిల్లా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్ పేట పోలీసులను ఎస్పీ అభినందించారు.

March 26, 2026 / 04:02 PM IST

శనగల క్వింటాల్ ధర రూ. 5.875

ADB: ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోలు షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.5,875 గా నిర్ణయించగా, ఎకరానికి 7.20 క్వింటాళ్ల చొప్పున సేకరించనున్నారు. బజార్హత్నూర్ మండల గ్రామాలకు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 27 వరకు తేదీలను ఖరారు చేశారు.

March 26, 2026 / 04:02 PM IST

ఖాళీ బాటిళ్ళలో పెట్రోల్ నింపకండి: ఎస్పీ

MDK: జిల్లాలో పెట్రోల్, డీజిల్‌‌ను డబ్బాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, వాటర్ బాటిళ్లలో పోయడాన్ని పూర్తిగా నిషేధించాలని ఎస్పీ డీ.వీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇంధనాన్ని డబ్బాలలో నిల్వ చేయడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంకు సిబ్బంది డబ్బాలలో పోయరాదని సూచించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బంకుల్లో ఈ నిబంధనలు అమలు చేయాలన్నారు.

March 26, 2026 / 04:01 PM IST

నర్వలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: నర్వ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎస్సీ సబ్ ప్లాన్ (NREGS) నిధులతో చేపట్టిన ఈ పనులను బీజేపీ మండల అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి ఇతర నేతలు ప్రారంభించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో భాగంగా పాఠశాల పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

March 26, 2026 / 04:01 PM IST

మావోయిస్టు నేత సాంబశివుడికి నివాళి

NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కోనపురి సాంబశివుడు 14వ వర్ధంతి చిట్యాల మండల గోకారం స్టేజి వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ఉద్యమ నేత కాటం వెంకటేశం ఇవాళ నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు.

March 26, 2026 / 04:01 PM IST

‘మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి’

BHNG: మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు మోత్కూరుకు వచ్చిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో వెనుకబడిన మోత్కూర్ అభివృద్ధిలో వెనకబడిందన్నారు.

March 26, 2026 / 04:01 PM IST

పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలి: సబ్ కలెక్టర్​

NZB: పాఠశాలల్లో గైర్హాజరును తగ్గించాలని సబ్ కలెక్టర్​ వికాస్​ మహతో సూచించారు. కోటగిరి మండలంలోని ఎత్తొండ గ్రామంలో ఉన్న ఎంపీయూపీఎస్​ను గురువారం సందర్శించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికను సబ్​ కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల గైర్హాజరును తగ్గించడంపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

March 26, 2026 / 04:01 PM IST

రేవంత్ రెడ్డి మత్య్సకారులకు చేసింది ఏమి లేదు: జంగిటి శ్రీనివాస్

SDPT: సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో మత్స్యకారులకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. గురువారం సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు ప్రభుత్వంలో ఉంటే ఏనాడు మత్స్యకారుల కోసం ఆలోచించలేదన్నారు.

March 26, 2026 / 04:01 PM IST

జాతియ రహదారిపై రోడ్డు ప్రమాదం.. రెండు లారీలు ఢీ

ప్రకాశం: టంగుటూరు మండలం సూర రెడ్డిపాలెం జాతియ రహదారి ఫ్లైఓవర్ మీద  బాపట్ల నుండి నెల్లూరు బియ్యంలోడ్ తో వెళుతున్న లారీనీ వెనుక నుంచి ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ముందు భాగాన స్టీరింగ్ వద్ద దెబ్బతింది. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.

March 26, 2026 / 04:00 PM IST