GDWL: జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు పైప్లైన్లు, మోటార్లకు మరమ్మతులు పూర్తి చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ‘వాటర్ ఇన్స్పెక్టర్ టీములను’ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జిల్లావ్యాప్తంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.