MDK: రామాయంపేటలోని PACSఆధ్వర్యంలో గురువారం మహాజన సభను ఘనంగా నిర్వహించారు. సంఘం సెక్రెటరీ నర్సింలు, స్టాఫ్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ సాయిలు, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ శ్వేత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో సంఘం చేపట్టిన ఆర్థిక లావాదేవీలు, రైతుల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.