MHBD: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ను చైనా వ్యాపారులు గురువారం సందర్శించారు. తేజ రకం మిర్చిని పరిశీలించి, నాణ్యతపై మార్కెట్ సిబ్బందితో చర్చించారు. మిర్చి ధరలు, సరఫరా స్థితిగతులు, ఎగుమతి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో తేజ మిర్చికి ఉన్న డిమాండ్ దృష్ట్యా, భవిష్యత్తులో కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.