SDPT: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని AIYF మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చి అమలు చేయక నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. చలో అసెంబ్లీ ముట్టడి సందర్భంగా కార్యకర్తల అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఖండించారు.
బాపట్ల పట్టణంలో డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగును వెంటనే తొలగించాలని కమిషనర్ రఘునాథరెడ్డి సూచించారు. గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. అంబేద్కర్ భవన్ రోడ్డులో పేరుకుపోయిన మురుగుపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎప్పుడూ నిరాటంకంగా ఉండేలా సిబ్బందికి సూచించారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు కొరియన్ బాంబూ సాల్ట్. దీని కిలో ధర సుమారు రూ.35,000పైగా ఉంటుందట. సముద్రపు ఉప్పును వెదురు గొట్టాల్లో నింపి, దేవదారు కట్టెలతో తొమ్మిది సార్లు, దాదాపు 50 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి దీనిని తయారు చేస్తారు. ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ ఉప్పును ఔషధ గుణాల కోసం వైద్యంలో, ప్రత్యేక రుచి కోసం వంటల్లో వాడుతుంటారు.
PLD: సత్తెనపల్లి నియోజకవర్గం ఫనిదేం గ్రామంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని సందర్శించి, రైతులతో మమేకమయ్యారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
VZM: నిర్దేశించిన కాల పరిమితిలో ఇంటి పన్నులు వసూలు చేయాలని DLPO ఉషారాణి ఆదేశించారు. గురువారం కొత్తవలస, ఎస్.కోట మండలాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. MPDO, Dy MPDO, పంచాయితీ సిబ్బందితో పాటు శానిటరీ మేస్తీలు కూడా టాక్స్, నాన్ టాక్స్ ఈనెల 31 లోపు లక్ష్యాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.
SRCL: సిరిసిల్ల శ్రీ గురుకులాశ్రమ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ మాలధారుల కోసం 11 రోజుల పాటు నిత్య అన్నదాన (భిక్ష) కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 2 వరకు ప్రతిరోజూ 250 మంది స్వాములకు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. గత పదేళ్లుగా దాతల సహకారంతో ఈ సేవను కొనసాగిస్తున్నట్లు ఏనుగుల ప్రభాకర్, శ్రీనివాస్ ఇతర నిర్వాహకులు తెలిపారు.
MLG: కోయగూడా పంచాయతీ పరిధిలోని రాంనగర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని సర్పంచ్ పోరిక సరిత అన్నారు. రాంనగర్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్‌ను సర్పంచ్ ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని 24వ వార్డులో గురువారం మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మీ-రామానంద్, కమిషనర్ కాటం భాస్కర్, స్థానిక కౌన్సిలర్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని, అవసరమైన చోట నూతన బోర్లు వేసి మోటర్లు అమర్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.
BHPL: ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయం&యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయాన్ని ఈనెల 28వ తేదీలోపు ఖాళీ చేయాలని కేంద్రం ఇచ్చిన నోటీసులను రేగొండ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోయిల క్రాంతి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణను చూసి బీజేపీ ఓర్వలేకపోతోందని, యువజన కాంగ్రెస్ చేసే పోరాటాలను జీర్ణించుకోలేక కక్ష సాధింపుకు పాల్పడుతోందని మండిపడ్డారు.
SRD: సిర్గాపూర్‌లో పశువుల తొట్టెల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పాటిల్ నేడు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద, మరొకటి నల్లవాగు వెళ్లే రహదారిలో పశువుల తొట్టెలు జీపీ నిధులతో నిర్మిస్తున్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని, పశువుల దాహార్తి కోసం వీటిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.
JN: పోలీసు శాఖలో ఒక బ్యాచ్లో రిక్రూట్ అయిన వారికి ఒకేసారి ప్రమోషన్ వచ్చేలా చూడాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసుల ఆరోగ్య భద్రత అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కోసం 15 లక్షల మంది యువత వేచి చూస్తున్నారని, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు.
AP: అమరావతిలో అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈనెల 11న L&T, 23న మేఘా ఇంజినీరింగ్ వద్ద ఘటనలు జరిగాయి. అయితే, దీనిపై గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరగనుంది. సిట్ బృందంలో నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉన్నారు. తుళ్లూరు సీఐ, డీఎస్పీ సిట్ బృందంలో సభ్యులుగా ఉన్నారు.
NDL: శ్రీశైలం మండలం సున్నిపెంట అక్కమ్మ సెంటర్ సమీపంలో నివసిస్తున్న నవీన్ (48) గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తలకు గాయం ఉండటంతో దాడి చేసి చంపారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సీఐ గంటా సుబ్బారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అంతర్జాతీయ క్రికెట్ డెబ్యూకి ముందు IPLలో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్(POTF)’ అందుకోవడం ముగ్గురికే సాధ్యమైంది. ఈ లిస్టులో తొలి ప్లేయర్ మన్విందర్ బిస్లా(KKR). 2012లోనే POTF అందుకున్న బిస్లా.. ఇప్పటికీ దేశానికి ఆడలేకపోయాడు. అటు 2014లో ఈ ఘనత సాధించిన మనీష్ పాండే(KKR).. 2015లో టీమిండియాలో చేరాడు. ఇక 2017లో POTF పొందిన కృనాల్ పాండ్యా(MI) కూడా 2018లో BCCI పిలుపు అందుకున్నాడు.
TPT: నారాయణవనం మండలం తుంబూరు గ్రామపంచాయతీలో ఫిషరీస్ పాండ్ పనులను గురువారం పథక సంచాలకులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులకు రోజుకు రూ.307 వేతనం అందే విధంగా పనులకు సరైన మార్కింగ్ ఇచ్చి క్రమబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి శ్రామికుడు వంద రోజుల ఉపాధిని పూర్తి చేసుకోవాలని కూడా సూచించారు.