VKB: జిల్లాలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను సీజ్ చేసినట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ CI అన్వర్ పాషా ఆధ్వర్యంలో దాడులు చేశారు. బీదర్‌కు చెందిన గిరిధర్ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి సరఫరా చేస్తున్నాడు. తాండూర్‌లో రేపాల శ్రీధర్ అనే వ్యాపారి 600 KGల వెల్లుల్లి పేస్ట్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
KDP: జిల్లాలో ‘సమస్య మీది – పరిష్కారం మాది’ నినాదంతో రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఇంటింటి పర్యటన చేపట్టారు. ఈడిగపాలెం వార్డు-2లో ప్రజల సమస్యలు తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర గురువారం తెల్లవారుజామున ఉదయం జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రయాణించిన వారి వివరాలు వెళ్లడయ్యాయి. ఈ చార్ట్‌ను పరిశీలిస్తే మృతులంతా 30 ఏళ్లలోపువారే కావటం దురదృష్టకరమని పలువురు పేర్కొంటున్నారు. అధికంగా జగిత్యాల, నిర్మల్, కోరుట్ల ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారు తిరిగి పామూరు, కనిగిరి, వింజమూరు, ప్రాంతాలకు చెందినవారుగా తెలుస్తోంది.
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో రోగులు, వారి సహాయకులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ ఒక మహిళా సహాయకురాలు బాత్రూంకు వెళ్లిన క్రమంలో పైనుంచి సిమెంటు దిమ్మెలు కిందపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు త్వరగా కొత్త భవనం నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
కృష్ణా: అవనిగడ్డ గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో అమ్మవారి ఉత్సవాల పోస్టర్లను ధర్మకర్తలు ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందించి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యువనాయకులు మండలి వెంకట్రామ్ పాల్గొన్నారు.
PLD: నరసరావుపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా కె.బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పాలన వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించినట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆర్డీవో కె.బాలకృష్ణ తెలిపారు.
విశాఖపట్నంలోని మరకవలస ప్రాంతంలోని హిమాద్రి ఐస్ ప్లాంట్‌లో ఇవాళ ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న సమయంలో స్లాబ్ కూలిపోవడంతో పీతల గోవింద్ (52) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
PDPL: ధర్మారం మండలం బొట్ల వనపర్తి ఎస్సీ కాలనీలో సర్పంచ్ సంఘ రంజిత్ ఆధ్వర్యంలో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ. 5 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా విధుల మంజూరుకు కృషిచేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
AKP: మత్స్యకార భరోసా పథకం కింద లబ్ధిదారుల గుర్తింపుకు గురువారం నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు మత్స్యకార గ్రామాల్లో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అధికారులు సర్వే ప్రారంభించారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. ఈ సహాయానికి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు.
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు బంద్ అయ్యాయి. దీంతో కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా తిరువూరు, గుంటూరు, గుడివాడలో వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకునేందుకు జనం ఎగబడ్డారు. దీంతో సాధారణం కంటే అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయని బంకు యజమానులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే ‘NO STOCK’ బోర్డులు కనిపిస్తున్నాయి.
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927 కోట్లు చెల్లించామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.1,480 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో CMRF చెక్కుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. తాము రూ.2,046 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఎవరి PAలు CMRF కాజేశారో కూడా తెలుసన్నారు. విచారణ జరుగుతోందని, అన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు.
SS: పుట్టపర్తిలోని పెద్దబజార్ ఎంపీపీ పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత ఆక్యుప్రెజర్, రిఫ్లెక్సాలజీ శిబిరం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆర్డవో సువర్ణ సందర్శించి నిర్వాహకుల సేవలను అభినందించారు. నటరాజ్ నేతృత్వంలోని నిపుణుల బృందం, యోగా శిక్షకుడు నారాయణరెడ్డి ప్రజలకు ఉచితంగా ఆరోగ్య మెళకువలు అందిస్తున్నారని కొనియాడారు.
SKLM: ఆమదాలవలసలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లోని విశాఖ డెయిరీలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాప్ తాళాలు పగలగొట్టి రూ.15 వేల వరకు దొంగలించినట్లు బాధితులు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై బాలరాజు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
E.G: సమాజ సేవ చేసేందుకు బాధ్యత కలిగిన పౌరులు ముందుకు రావాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం మండలం రావికవతంలోని పీహెచ్‌సీలో వైద్యురాలిగా పని చేసి రిటైర్డ్ అయిన వేమన కళావతి ఆమె దాచుకున్న దానిలోంచి పేదలకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో రూ. 5 లక్షలు కేటాయించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో సదరు చెక్కును ఆమె అందజేశారు.