KRNL: ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి దక్కనుందని జిల్లా TDP అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ ఇవాళ తెలిపారు. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో 5,475 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ఏర్పడనుండగా, లక్ష మందికి ఉపాధి లభించనుందన్నారు. ప్రాజెక్ట్‌తో రాష్ట్రం గ్లోబల్ స్టీల్ హబ్‌గా మారుతుందని ఆమె పేర్కొన్నారు.