NZB: ధర్పల్లి మండల తహశీల్దార్ శాంత విలేకరుల సమావేశంలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు ‘మన ఇసుక వాహనం’ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవాలని సూచించారు. డిప్యూటీ CM ఆదేశాల మేరకు ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. పర్యవేక్షణ కోసం తహశీల్దార్, పంచాయతీ కార్యదర్శులు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.