NRML: భైంసా మున్సిపాలిటీలోని తై బజార్‌కు మంగళవారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ వై.నవీన్ తెలిపారు. 2026-27 ఆర్థిక సం.నికి సంబంధించిన తై బజార్ వేలం ఈ నెల 31న పురపాలక కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంపాటలో పాల్గొనాల్సిన వారు తై బజార్‌కు రూ.10 వేలు ధరావత్తును డీడీ రూపంలో అదే రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు అందజేయాలని కోరారు.