SRPT: మోతె మండలం రాఘవపురంకి చెందిన బీఆర్ఎస్ నాయకులు, మాజీ వార్డు మెంబర్ పజ్జూరి నారాయణ మృతి చెందడం పట్ల కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం రాఘవపురం గ్రామానికి చేరుకున్న ఆయన, నారాయణ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.