BHNG: చౌటుప్పల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి యాదవ్ ఒక ముఖ్యమైన విన్నపాన్ని మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్ ముందు ఉంచారు. మున్సిపాలిటీ మొత్తం మీద ఒక్కటే స్వర్గపురి వాహనం ఉండటం వల్ల దహన సంస్కారాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు. మరో స్వర్గపురి వాహనాన్ని వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు.