JN: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వర్లును శనివారం నెల్లుట్ల సర్పంచ్ నర్సింగ రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ నీటిని నెల్లుట్ల గ్రామ చెరువులోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల చెరువు నీరు కలుషితమై ప్రజల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే కమిషనర్ స్పందించాలన్నారు.