BHPL: జిల్లా కేంద్రంలో TBGKS & BRS ఆధ్వర్యంలో ఇవాళ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి, TBGKS రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి, BRS జిల్లా అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డును పునరుద్ధరించి డిపెండెంట్ కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.