VKB: జిల్లాలోని పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు.