AP: రాజధాని విషయంలో మహిళా రైతులు ఎంతో పోరాటం చేశారని హోంమంత్రి అనిత కొనియాడారు. రైతులు చేస్తున్న పోరాటాన్ని వైసీపీ ప్రభుత్వం హేళనగా చూసిందని మండిపడ్డారు. చివరికి విజయం సాధించి చూపారని తెలిపారు. విజనరీ నాయకుడు చంద్రబాబు సంకల్పంతోనే అమరావతికి ముందడుగు పడిందని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు.