RR: నందిగామ మండల కేంద్రంలోని శ్రీకృష్ణ పత్తి గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. అయితే విషయాన్ని తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఘటన స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పడిన ఉరుములు, వర్షాల కారణంగా ఏదైనా ప్రమాదం సంభవించిందా? అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.