NLG: డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డైరెక్టర్ ఆనంద్ పవార్ రేపు నల్గొండలో పర్యటించనున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని NG కళాశాలలో నిర్వహిస్తున్న తరగతులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ అన్ని గ్రూపులకు చెందిన విద్యార్థులు ఈ క్లాసులకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
HYD: 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల కెరీర్‌లో అత్యంత కీలకమని HYDలో ఎడ్యుకేషన్ అవార్డ్స్ ప్రోగ్రాంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఆకర్షణలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తుందన్నారు.
అన్నమయ్య: అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు తరపున మంత్రి పొంగూరు నారాయణ తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 పునర్విభజన చట్టం సెక్షన్-5 సవరణల కోసం కేంద్రాన్ని కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ (51*) చేశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 11.2 ఓవర్లకు జట్టు స్కోర్ 97/3. ఇషాన్‌తో పాటు క్లాసెన్ 23* క్రీజులో ఉన్నాడు. హెడ్ 11, అభిషేక్ శర్మ 7, నితీశ్ కుమార్ 1 రన్స్ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3 వికెట్లు తీశాడు.
BDK: శిక్షణలో నేర్చుకున్న మెలకువలతో తేనె సేకరణ, ఆన్‌లైన్ మార్కెటింగ్ చేపట్టి అదనపు ఆదాయం పొందాలని ITDA PO బి. రాహుల్ సూచించారు. తేనెటీగల పెంపకం ద్వారా యువత స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని పీవో శనివారం పిలుపునిచ్చారు. స్థానిక YTCలో 5 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
KMR: గాంధారి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద శనివారం సాయంత్రం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని గ్రామస్థులు నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా 20 మంది మల్లయోధులు తరలివచ్చారు. స్థానిక మరియు పొరుగు రాష్ట్ర మల్లయోధుల మధ్య జరిగిన ఈ పోరాటాలు అత్యంత హోరాహోరీగా, రసవత్తరంగా సాగి ప్రేక్షకులను అలరించాయి.
MBNR: జిల్లా కేంద్రంలోని 24వ డివిజన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేటర్ రాధా గోవర్ధన్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. డివిజన్‌లోని పెండింగ్ సమస్యలను ఆమె స్థానిక ఎమ్మెల్యే, మేయర్, డిప్యూటీ మేయర్ల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు మున్సిపల్ పాలకవర్గం పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
BHNG: గుండాల మండలం మాసాన్పల్లికి చెందిన బత్తిని హరీష్ గౌడ్ (24) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేసి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. ఉప్పల్లో నివసించే హరీశ్ అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి ప్రాణదానం లభించింది. విషాదంలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు ఆర్సీఎం చర్చి వద్ద యేసు తిరు హృదయ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూడో రోజు ఏలూరు బిషప్ పొలిమేర జయరావు హాజరై యేసు ప్రేమ, క్షమ, దయ గుణాల ప్రాధాన్యత వివరించారు. ప్రత్యేక దివ్య బలి పూజ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఫాదర్ గోళ్ళ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
VSP: గుజరాత్‌లో జరిగిన జాతీయ సదస్సులో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు పలు అవార్డులు సాధించారు. ఎంఎస్సీ సైకాలజీ విద్యార్థినులు జె.మనీషా, ఎం.కారుణ్య ‘యంగ్ సైకాలజిస్ట్’ అవార్డును అందుకోగా, గౌరీ లక్ష్మి కొరిబిల్లి ‘నైనా సింగ్ మెమోరియల్’ అవార్డును గెలుచుకున్నారు. వారి పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయని ఏయూ వీసీ రాజశేఖర్ అభినందించారు.
NZB: నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాయత్రినగర్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై శనివారం సీసీఎస్ (CCS) పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు విటులు, నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,690 నగదు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ATP: కళ్యాణదుర్గం మండలం పాలవాయిలో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులు ఉంటే ప్రజలు నేరుగా 9550480972 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
AKP: ఎలమంచిలి మండలం రామారాయుడుపాలెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారంతో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ టీ.లవ కూమార్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 45 పశువులను పరీక్షించి మందులు ఉచితంగా అందజేశారు.
NTR: తిరువూరు పట్టణంలోని చీరాల సెంటర్ వద్ద జూదం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు శనివారం దాడి చేశారు. SI-II రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో “కోతముక్క” జూదం ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.8,400 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జూదానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.
SRCL: సిరిసిల్లలోని కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలతో 14,820 కేసులను పరిష్కరించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ తెలిపారు. సిరిసిల్లలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 14,820 కేసులను పరిష్కరించి బాధితులకు రూ. 6,74, 41,119 నష్టపరిహారంగా ఇప్పించామన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమన్నారు.