HYD: ఉస్మానియా ప్రొఫెసర్ సందీప్త సూక్ష్మజీవ శాస్త్రంలో కీలక పరిశోధనలు నిర్వహించారు. చేపల నూనెలో రక్తపోటును తగ్గించే ప్రత్యేక పెప్టైడ్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ ధ్రువీకరణ లభించింది. ముఖ్యంగా అచోవీ చేపల్లోని అమైనో ఆమ్లాలను వినియోగించడం ద్వారా రక్తపోటును నియంత్రించవచ్చని పేర్కొన్నారు.