W.G: గల్ఫ్ దేశంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్ సలీంను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ముస్కుడి రమేష్‌ను డ్రైవర్ పనికి బదులు ఇంటి పనిలో చేర్పించడంతో అతని భార్య ఫిర్యాదు మేరకు సీఐ బి.యాదగిరి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.