• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దివ్యాంగుల స్వాలంబనకు ఉచిత బస్సు ప్రయాణం

PPM: దివ్యాంగుల ఆర్థిక స్వాలంబన కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించి, ఈ పథకం ద్వారా విద్య, ఉపాధి, వైద్య సేవలకు ప్రయాణం సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్టీసీ సిబ్బంది, దివ్యాంగులు పాల్గొన్నారు.

March 18, 2026 / 07:18 PM IST

‘అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి’

శ్రీకాకుళం పట్టణంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు, సాగు భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమం ఉంటుందని బుధవారం తెలిపారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి ఇవ్వాలని సూచించారు.

March 18, 2026 / 07:18 PM IST

బాధితులకు పరిహారం చెక్కులు అందజేత

ASR: పోలవరం ప్రాజెక్టు కారణంగా రంపచోడవరం నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఉగాది కానుకగా నిర్వాసితులకు 3వ విడత ఆర్&ఆర్ పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అమరావతిలో అందించారు. చింతూరు డివిజన్‌కు చెందిన బాధితులను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అమరావతికి తీసుకువెళ్లారు. సీఎం చేతుల మీదుగా వారికి పరిహార చెక్కులు అందజేశారు.

March 18, 2026 / 07:17 PM IST

‘రైతన్నకు ప్రభుత్వ పథకాల భరోసా’

అన్నమయ్య: రాజంపేట మండలం పెద్దకారంపల్లె గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్” కార్యక్రమంలో భాగంగా డోర్‌ టు డోర్ ప్రచారం నిర్వహించారు. రైతుల సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ అంతిమ ద్యేయమని తెలిపారు. పథకాల ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తూ వ్యవసాయ ఖర్చులకు తోడ్పాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

March 18, 2026 / 07:15 PM IST

అంబులెన్స్‌కు అడ్డొచ్చిన ఆవు.. తప్పిన ప్రమాదం

W.G: మొగల్తూరు మండలంలోని కొత్తోట వద్ద బుధవారం ఆవు అడ్డు రావడంతో ఓ ప్రైవేట్ అంబులెన్స్ దానిని ఢీకొట్టింది. తిరుపతి నుంచి కాకినాడ ఆసుపత్రికి 2 నెలల బాబును తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమై నిలిచి పోయింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది రాజేష్, రత్నసాగర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాబును వేరొక వాహనంలో తరలించారు. 

March 18, 2026 / 07:15 PM IST

మిత్రుని కుటుంబానికి అండగా నిలిచారు..!

SRPT: నడిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1974-75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివిన మిత్రులు తమ సహచరుడు, దివంగత షేక్ మౌలానా కుటుంబానికి అండగా నిలిచారు. బుధవారం మౌలానా భార్యను పరామర్శించి, మానవతా దృక్పథంతో రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత మిత్రులంతా కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు.

March 18, 2026 / 07:14 PM IST

ప్రేమ విఫలం.. యువతి ఆత్మహత్య

AP: పల్నాడు జిల్లా మాచర్లలో విషాదం నెలకొంది. ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నేళ్లుగా చౌడమ్మ, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు ప్రేమలు ఉన్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించరని.. ఇంటి నుంచి వెళ్లిపోయారు. కానీ 4 రోజుల క్రితం చౌడమ్మను ఆమె తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

March 18, 2026 / 07:13 PM IST

22న అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్

VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈనెల 22న అంతర్జాతీయ విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం జరగనుంది. ఏయూలో చదువుతున్న విదేశీ విద్యార్థులు తమ దేశాల సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమ పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ విడుదల చేశారు.

March 18, 2026 / 07:12 PM IST

ఈద్గా స్థలాన్ని పరిశీలించిన ఆత్రం సుగుణ

ASF: ముస్లిం సోదరుల పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని ఈద్గా స్థలాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు. పండుగ రోజు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే నేపథ్యంలో ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని ఆమె సూచించారు. రంజాన్ పండుగ శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

March 18, 2026 / 07:11 PM IST

ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

SRCL: గంభీరావుపేట మండలం లింగన్నపేట, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, ముస్తాబాద్,0 పోతుగల్లులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ఆరోగ్య పథకాలను నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని సూచించారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలని వివరించారు.

March 18, 2026 / 07:11 PM IST

‘సొంతింటి కలను సాకారం చేసుకోవాలి’

ADB: అర్హులైన ప్రజలందరూ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండ తండాలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.

March 18, 2026 / 07:09 PM IST

గ్రామ బాలల పరిరక్షణ కమిటి ఏర్పాటు

JGL: జగన్నాధపురం గ్రామంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీని ఇవాళ ఏర్పాటు చేశారు. కమిషన్ మెంబర్ M. చందన ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం జగిత్యాల అధ్యక్షతన జరిగింది. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి పిల్లల యొక్క హక్కులను కాపాడడం, వారి యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఈ కమిటీ పనిచేయాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

March 18, 2026 / 07:09 PM IST

భీమదేవరపల్లిలో రంజాన్ కిట్స్ పంపిణీ..

HNK: భీమదేవరపల్లి మండలంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు రంజాన్ కిట్స్ పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐలయ్య అన్నారు.

March 18, 2026 / 07:09 PM IST

కలసపాడులో గుండెపోటుతో వ్యక్తి మృతి

KDP: కలసపాడు మండలం కొండపేటకి చెందిన పాలకొలను వెంకటరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి వారి నివాసానికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కష్టకాలంలో పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగ ఉంటుందన్నారు.

March 18, 2026 / 07:08 PM IST

“బుకింగ్‌లో సీరియల్ క్రమాన్ని తప్పనిసరిగా పాటించాలి”

BHPL: LPG సిలిండర్ల బుకింగ్‌లో సీరియల్ క్రమాన్ని తప్పనిసరిగా పాటించి, వినియోగదారులకు సకాలంలో జాప్యం లేకుండా క్రమబద్ధంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని LPG డీలర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పారదర్శకంగా సేవలు అందించాలని డీలర్లకు సూచించారు.

March 18, 2026 / 07:08 PM IST