• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘భక్తులు మెచ్చేలా అన్ని వసతులు కల్పించాలి’

KNR: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27వ తేదీన సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇల్లందకుంట తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పరిశీలించారు.

March 23, 2026 / 08:33 PM IST

బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ: SP

ADB: బాధితులకు అండగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సోమవారం తెలియజేశారు. పట్టణంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. నలుమూలల నుండి వచ్చిన 28 మంది ఫిర్యాదుదారులు ఎస్పీకి నేరుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని SP ఆదేశించారు.

March 23, 2026 / 08:33 PM IST

‘శెట్టిబలిజ ఉన్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది’

ELR: జంగారెడ్డిగూడెం పట్టణ TDP కార్యాలయంలో సోమవారం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు. శెట్టిబలిజ ఉన్నత కోసం ఆయన చేసిన కృషినీ మరువలేమని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వర రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన చత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నేతలు నివాళులర్పించారు.

March 23, 2026 / 08:31 PM IST

రేపు పోలీసులు స్వాధీనం చేసుకున్న ఇసుకకు వేలం

MHBD: చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆకేరు వాగు నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇసుకను ఈనెల 24న వేలం వేయనున్నట్లు సోమవారం తహసీల్దార్ ప్రశాంత్ తెలిపారు. ఎస్సైప్రవీణ్ కుమార్ స్వాధీనం చేసుకున్న 13 ట్రాక్టర్ల ఇసుకను పోలీస్ స్టేషన్ ఆవరణలో డంప్ చేసినట్లు చెప్పారు. మంగళవారం ఉదయం 11 గంటలకు వేలం పాట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 23, 2026 / 08:31 PM IST

కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేత

NZB: వేల్పూర్ మండలం లక్కోర గ్రామ పంచాయతీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ కార్య క్రమం జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారు విజయకు సర్పంచ్ దాసరి అపర్ణ రాజేశ్వర్, ఉప సర్పంచ్ ఆడవల ఆత్మరాం చేతుల మీదుగా ఈ చెక్కును అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని నాయకులు పేర్కొన్నారు.

March 23, 2026 / 08:30 PM IST

తాగునీటి ఎద్దడికి చర్యలు: కలెక్టర్

WNP: వేసవి దృష్ట్యా జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని కలెక్టర్ శ్రీ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గతంలో ఇబ్బందులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, పైపులైన్ల మరమ్మతులు ముందే పూర్తి చేయాలన్నారు. నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

March 23, 2026 / 08:30 PM IST

ప్రత్తిపాడు CHCలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC)లో గుంటూరు జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై నేరుగా ఆరా తీశారు. ఆసుపత్రి నిర్వహణలో లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం గమనించిన కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

March 23, 2026 / 08:30 PM IST

మేళ్లచెర్వు నాయబ్ తహసీల్దార్ సస్పెండ్

SRPT: కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అక్రమంగా పౌతి (సక్సెషన్) చేసిన మేళ్లచెర్వు నాయబ్ తహసీల్దార్ శ్రీధర్ నాయక్‌పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వేటు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

March 23, 2026 / 08:30 PM IST

విద్యుత్ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి

PDPL: ధర్మారం మండలం కటికనపల్లిలో విద్యుత్ షాక్‌తో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. బొజ్జ అభిరాం (6) అనే బాలుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి అన్నం తిని, పక్కనగల బల్ల కుమార్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా చేతికి ఎర్త్ వైర్ తగిలి ప్రమాదవశాత్తు మరణించాడు. తండ్రి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

March 23, 2026 / 08:30 PM IST

‘మహా ధర్నాను జయప్రదం చేయాలి’

NLG: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా ను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం మునుగోడులో చేనేత కార్మికులతో కలిసి ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. చేనేత కార్మికులకు రూ. 5 లక్షల ఆరోగ్య భీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

March 23, 2026 / 08:30 PM IST

ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ తప్పులు చేయకండి

ఇంట్లో శాంతి, సానుకూల వాతావరణం ఉండాలంటే మన రోజువారీ అలవాట్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేసే చిన్న తప్పులు ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతుంది. ఇంట్లోకి వచ్చే ముందు చెప్పులు, బూట్లు ఎక్కడపడితే అక్కడ వదిలేయకూడదు. బయట నుంచి కోపం, టెన్షన్‌తో ఇంట్లోకి రావడం మంచిది కాదు. బయట నుంచి వచ్చాక చేతులు, కాళ్లు కడుక్కోవాలి.

March 23, 2026 / 08:27 PM IST

‘ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాప్ ఏర్పాటు చేయాలి’

ASR: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బొర్రా గుహలకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారని అరకు ఎంపీ తనూజారాణి తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బొర్రా రైల్వే స్టేషన్‌లో స్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఈమేరకు సోమవారం ఢిల్లీలో భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే కటికి జలపాతం వద్ద రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్నారు.

March 23, 2026 / 08:27 PM IST

పైప్డ్ గ్యాస్ వినియోగంపై సమీక్ష సమావేశం

SS: పుట్టపర్తి కలెక్టరేట్‌లో ‘థింక్ గ్యాస్’ ప్రతినిధులతో సోమవారం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్యాస్ సరఫరాపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. హిందూపూర్, పుట్టపర్తి పట్టణాల్లో గృహ అవసరాల నిమిత్తం పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 23, 2026 / 08:27 PM IST

‘సింగరేణి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు’

BHPL: సింగరేణి ఆర్జీ-1, 2, 3, భూపాలపల్లి ఏరియాలో NCWA ఉద్యోగుల వార్షిక ఇంక్రిమెంట్ల ప్రక్రియ మొదలైంది. సుమారు 15,300 మంది ఉద్యోగులకు మార్చి 2026 ఇంక్రిమెంట్లను ఆడిట్ విభాగం నమోదు చేస్తోంది. ఫైనాన్స్ మేనేజర్ మోహన్ రావు పర్యవేక్షణలో అధికారులు, క్లరికల్ సిబ్బంది ఈ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.

March 23, 2026 / 08:27 PM IST

అర్జున్ టెండూల్కర్‌కు కష్టమే: అశ్విన్

LSG ప్లేయర్ అర్జున్ టెండూల్కర్‌పై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘లక్నో జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నందున అర్జున్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం చాలా కష్టం’ అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కేవలం పేరు ఉంటే సరిపోదని, జట్టు ఎంపికలో ఆటతీరుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నాడు. అర్జున్ తనను తాను నిరూపించుకోవాలని తెలిపాడు.

March 23, 2026 / 08:27 PM IST