• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

భక్తుడి వద్దకు భగవంతుడు

TPT: శ్రీకాళహస్తి మండలం ఊరందురు గ్రామంలో వెలసి ఉన్న నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి శ్రీకాళహస్తీశ్వరుడు గురువారం బయలుదేరనున్నాడు. నీలకంఠుడు అనే భక్తుడు ఊరందూరు క్షేత్రంలో శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన కోరిక మేరకు శివకామ సుందరి సమేతులైన నటరాజుడు నాట్యం చేయగా నీలకంఠుడు శివుడిలో ఐక్యమయ్యాడు.

March 26, 2026 / 10:26 AM IST

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

VKB: గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ ఛైర్మన్ ఎన్. ప్రశాంత్ అన్నారు. కొడంగల్ మండలం సంగాయిపల్లిలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ హన్మయ్య, నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అంజి, వార్డు సభ్యులు ఉన్నారు.

March 26, 2026 / 10:23 AM IST

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

మార్కాపురం జిల్లా సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో మృతుల వివరాలు, గాయపడిన వారి పరిస్థితిని అధికారులతో కలిసి తెలుసుకుంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

March 26, 2026 / 10:23 AM IST

ఎమ్మెల్యే చేతుల మీదుగా కంప్యూటర్ల పంపిణీ

SRD : బొల్లారం డివిజన్ కార్యాలయం ముందు ITC కంపెనీ CSR నిధులతో 8 ఎలక్ట్రిక్ ఆటోలు, 15 కంప్యూటర్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. డిప్యూటీ కమిషనర్ అమీన్‌పూర్ సర్కిల్ ప్రదీప్ కుమార్‌కు ఆటోలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు కంప్యూటర్లు అందజేశారు. అభివృద్ధి, విద్యకు తోడ్పాటు అందించడమే లక్ష్యమని తెలిపారు.

March 26, 2026 / 10:22 AM IST

న్యాయవాదుల సహకార సొసైటీ ఎన్నికల అధికారుల నియామకం

NZB: జిల్లా న్యాయవాదుల పరస్పర సహకార సొసైటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్‌లను నియమించారు. సొసైటీ అధ్యక్షుడు కె. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ వారికి నియామక పత్రాలు అందజేశారు.

March 26, 2026 / 10:21 AM IST

కోవెలకుంట్ల గ్రామపంచాయతీకి భారీ ఆదాయం

NDL: కోవెలకుంట్ల మేజర్ గ్రామపంచాయతీకి సంబంధించి వేలం పాటల ద్వారా రూ.35.09 లక్షల ఆదాయం సమకూరినట్లు జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారి నరసింహారెడ్డి వెల్లడించారు. బుధవారం కోవెలకుంట్లలోని పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో సంత మార్కెట్, దినసరి కూరగాయల మార్కెట్, కబేళా మార్కెట్ తదితర వాటికి సంబంధించి వేలం పాటలను నిర్వహించారు.

March 26, 2026 / 10:21 AM IST

‘స్మశానంలో ఇళ్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు’

KRNL: ఆస్పరి మండలం నగరూరు గ్రామంలోని సమాధుల్లో ఇళ్లు కట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. జగన్న కాలనీలో అభివృద్ధి పేరుతో రూ. 20 లక్షలు స్వాహా చేశారని, అవినీతిపరులపై కేసులు నమోదు చేసి నిధులను రికవరీ చేయించాలని శివప్రసాద్ డిమాండ్ చేశారు.

March 26, 2026 / 10:20 AM IST

మత్స్యకార భరోసా పథకంపై సర్వే

AKP: మత్స్యకార భరోసా పథకం కింద వేట నిషేధ సమయంలో వారికి అందించే సహాయంపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఎస్ రాయవరం మండలం పోలవరం గ్రామంలో సర్వే ప్రారంభించారు. సర్వే ద్వారా అర్హులైన వారిని గుర్తిస్తున్నట్లు మత్స్యశాఖకు చెందిన అసిస్టెంట్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు కొరివి బంగారి, టీడీపీ నేత కోడ లోవరాజు, తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 10:20 AM IST

‘సంతబయలులో అక్రమ కట్టడాలను అరికట్టాలి’

ASR: డుంబ్రిగుడ మండలంలోని అరకు సంతబయలు గ్రామంలో గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే అరికట్టాలని ఆదివాసి గిరిజన సంఘం నేతలు పీ. సూర్యనారాయణ, పీ. సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఆరోపించారు. పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.

March 26, 2026 / 10:20 AM IST

‘పట్టణ సమస్యలు పరిష్కరించండి’

మెదక్ పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిటిజెన్స్ ఫోరం సభ్యులు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాధికా భూపతిరాజును కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీర్ నితిన్‌లతో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఫోరం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, భూపాల్ రెడ్డి, భుజంగ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 26, 2026 / 10:18 AM IST

శర్వా ‘భోగి’ వచ్చేది ఈ OTTలోకేనా..!

టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న మూవీ ‘భోగి’. తాజాగా ఈ సినిమా OTT డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. 2026 దసరా కానుకగా ఈ మూవీ విడుదల కానున్నట్లు టాక్.

March 26, 2026 / 10:18 AM IST

మంగపేటలో గ్రామపంచాయతీ కార్యదర్శులు ట్రాన్స్‌ఫర్

MLG: మంగపేట మండలంలోని 11 గ్రామపంచాయతీల కార్యదర్శులు బదిలీఅయ్యారు. ఈ మేరకు కలెక్టర్ దివాకర బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సురేష్ మంగపేట నుంచి తుపాకులగూడెం, స్వప్న చెరుపల్లి నుండి గుమ్మడిదొడ్డి, రూప్ సింగ్ నర్సింహాసాగర్ నుంచి ఏడుజర్లపల్లి, రాజు రమణక్కపేట నుంచి బందాల, రాజేష్ చుంచుపల్లి TO లింగాల,సుధారాణి పూరెడుపల్లి TO బుట్టాయిగూడెం బదిలీఅయ్యారు.

March 26, 2026 / 10:17 AM IST

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: అచ్చెన్న

AP: మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోవైపు మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే దామాచర్ల, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

March 26, 2026 / 10:16 AM IST

‘కళాశాల అనుమతులు తప్పకుండా ఉండాలి’

KRNL: ప్రభుత్వ అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఓ కళాశాల యాజమాన్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని PDSU రాష్ట్ర అధ్యక్షుడు కె. భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయంలో ఆర్‌వో లాలప్పకు వినతిపత్రం అందజేశారు. అనుమతి లేకుండా ప్రచారం చేస్తూ.. అడ్మిషన్లు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

March 26, 2026 / 10:15 AM IST

అన్నమరాజుపేటలో రాములోరి ఊరేగింపు

VZM: జామి మండలం అన్నమరాజుపేటలో శ్రీరామనవమి పురస్కరించుకొని ఇవాళ సీత, లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తిని గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు భజనలు, సంకీర్తనలు ఆలపిస్తూ రాములోరి వెంట కదిలారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

March 26, 2026 / 10:15 AM IST