• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశం

VKB: పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు సొసైటీ ఆవరణలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి రాజమౌళి తెలిపారు. ఈ సమావేశంలో 2025-26 ఆస్తి-అప్పుల పట్టిక ఆమోదం, 2026-27 అంచనా బడ్జెట్ నిర్ణయం, మరణించిన సభ్యుల పేర్ల తొలగింపు అంశాలపై చర్చించనున్నారు.

March 29, 2026 / 10:08 AM IST

ఉమ్మడి జిల్లాలో ఉక్కపోత.. కారణమిదే!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కోటగిరి, మోస్రా 41.4°C, భీమ్ గల్ 41.3, సాలూర, జకోరా 41.2, బాల్కొండ, మెండోరా 41.1, మంచిప్ప, బిచ్కుంద 40.7, పిట్లం 40.6, జక్రాన్ పల్లి, చీమన్ పల్లి 40.5, భిక్కనూరు 40.4, తొండకూర్, ఎల్పుగొండ 40.3, NZB సౌత్, కొల్లూరు 40.2,మేనూర్ 40.1°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 29, 2026 / 10:07 AM IST

మండలంలో మాంసం ధర వివరాలు

TPT: నాయుడుపేట మండలంలో గత వారం కన్నా ఈ వారం చికెన్ ధరలు తగ్గాయి. బాయిలర్, ఫారం కోడి గత వారం రూ. 300 పలుకగా ఈ వారం రూ.240కి తగ్గింది. కిలో మటన్ రూ.800-900 పలుకుతోంది. అలాగే కేజీ కొరమేను చేపలు రూ.250-రూ.300 వరకు ఉంది. మాంసం ధరలు తగ్గడంతో మాంసాహార ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

March 29, 2026 / 10:07 AM IST

వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు

RR: వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టటం జరుగుతుందని షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ అన్నారు. కమ్మదనం మిషన్ భగీరథ నీటి సరఫరా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో నీటి కొరత ఆటంకం ఏర్పడిన ముందస్తు చర్యల క్రింద నీటి సరఫరా జరిగే విధంగా పూర్తి చర్యలు తీసుకునేందుకు అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

March 29, 2026 / 10:07 AM IST

నేటి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సమ్మర్ షెడ్యూల్

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సమ్మర్ షెడ్యూల్ నేటి నుంచి అక్టోబర్ 24 వరకు అమల్లోకి వచ్చింది. అధికారుల వివరాలు.. రోజుకు 33 విమానాలు నడుస్తుండగా, వింటర్ షెడ్యూల్‌తో పోలిస్తే 10-15% పెరిగాయి. ఇండిగో 21 సర్వీసులతో ముందంజలో ఉంది. అబుదాబి, సింగపూర్‌కు వారానికి 4 చొప్పున హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు సహా పలు నగరాలకు మెరుగైన కనెక్టివిటీ అందుబాటులో ఉంది.

March 29, 2026 / 10:05 AM IST

శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలి: వెంకయ్య నాయుడు

TG: యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా, శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రతిరోజూ యోగా, నడక లేదా సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మానసిక చైతన్యం పొందుతారని తెలిపారు. ‘దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ మాటలను గుర్తు చేస్తూ, ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం శక్తివంతమవుతుందని పేర్కొన్నారు.

March 29, 2026 / 10:05 AM IST

మరో 20 రోజుల్లో నాచారం బాక్స్ నిర్మాణం పూర్తి: AE

MDCL: నాచారం పరిధిలోని మల్లికార్జున నగర్ ప్రాంతంలో కొనసాగుతున్న బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులపై స్థానికుల ఆందోళనలకు స్పందించిన అసిస్టెంట్ ఇంజనీర్ స్పందన, పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను మరో 20 రోజుల్లో పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానికులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

March 29, 2026 / 10:05 AM IST

రాయచోటిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అన్నమయ్య: గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపన లక్ష్యాలను గుర్తుచేసుకుంటూ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 29, 2026 / 10:04 AM IST

రాజాంలో కార్డెన్ సెర్చ్.. 30 వాహనాలు స్వాధీనం

VZM: రాజాం పోలీస్ స్టేషన్ పరిధి రెల్లి వీధి, గొల్ల వీధిలో ఇవాళ పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ భాగంగా ‘కార్డెన్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 70 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని విస్తృతంగా గాలింపు చేపట్టారు. తనిఖీల సమయంలో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

March 29, 2026 / 10:03 AM IST

ఇచ్చోడ పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

ADB: ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

March 29, 2026 / 10:03 AM IST

గోపాల్‌పేటలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

WNP: గోపాల్‌పేట మండల కేంద్రంలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నిత్య ఆరాధన, సుందరకాండ హోమం, ప్రసాద వినియోగం నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు రథోత్సవం జరుగుతుందని అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 29, 2026 / 10:02 AM IST

భీమడోలులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఏలూరు: భీమడోలులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్నే వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జోహార్ అన్న ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

March 29, 2026 / 10:02 AM IST

భీమడోలులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

ఏలూరు: భీమడోలులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆప్కాబ్ ఛైర్మన్ గన్నే వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జోహార్ అన్న ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.

March 29, 2026 / 10:02 AM IST

‘సింగరేణి యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయం’

PDPL: సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని సింగరేణి సంస్థ GM లలిత్ కుమార్ అన్నారు. స్థానిక సింగరేణి TTC ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల వాల్వో డంప్ ట్రక్ డ్రైవింగ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 49 మందికి సర్టిఫికెట్లు అందజేశారు.

March 29, 2026 / 10:02 AM IST

సబ్‌స్టేషన్ షాప్ మంజూరు

JGL: గొల్లపల్లి నల్లగుట్ట ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా రేషన్ షాప్ కోసం ప్రజలు పడుతున్న నిరీక్షణకు తెరపడింది. రేషన్ సరుకులు తీసుకోవడానికి 2 కి.మీ. పైగా నడవవలసి వస్తుండేది. ఉప సర్పంచ్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు డిసెంబర్ 30, 2025లో విన్నవించగా స్పందించిన మంత్రి 400 రేషన్ కార్డులతో ప్రజలకు అందుబాటులో సబ్ రేషన్ షాపును మంజూరు చేశారు.

March 29, 2026 / 10:01 AM IST