NRPT: పశు పోషణకు తోడ్పాటుగా ప్రభుత్వం 70 శాతం సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దామరగిద్ద మండలంలోని 30 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 12,678 పశువులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 9,423 ఆవులు, ఎద్దులు 3,256 గేదెలు ఉన్నాయి. ప్రభుత్వం 70 శాతం సబ్సిడీపై 5 కిలోల బస్తా పశుగ్రాస విత్తనాన్ని రూ.130కే అందిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
NZB: సిరికొండ జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్ర పల్లె ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ గంగాధర్ ప్రారంభించారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ధన్య వాదాలు తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, ఉప సర్పంచ్ కౌశల్య పాల్గొన్నారు.
TG: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జెండా ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మురళీధర్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ELR: గణపవరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపట్టిన అధికారులు తమ తమ గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి మౌలిక వసతులు, ప్రజల అవసరాలను సమగ్రంగా గుర్తించాలని సూచించారు.
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో సమాచార హక్కు రక్షణ చట్టం సొసైటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల నియామకం జరిగింది. జిల్లా అధ్యక్షుడు వంగరి ప్రవీణ్ సమక్షంలో సోమవారం సిర్పూర్ నియోజకవర్గ కమిటీ సభ్యుడిగా బాసిక సత్యనారాయణ, మండల కమిటీ సభ్యుడిగా గగన్ రాయ్‌కి నియామక పత్రాలు అందజేశారు. సమాచార హక్కు చట్టం ప్రజలకు కీలక సాధనమని, చట్టాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలన్నారు.
MNCL: ఓబీ కాంట్రాక్టర్ల సమస్యతోనే అనుకున్న ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయామని శ్రీరాంపూర్ ఏరియా GM శ్రీనివాస్ సోమవారం ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు ఆపేశారని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ సమస్యలను అదిగమిస్తామన్నారు. కొత్త ఓబీ టెండర్లు పిలిచామని, SRP-OCPలో కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టామని, ఇందారం OCPలో కూడా పనులు మొదలవుతున్నాయన్నారు.
ADB: బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో జొన్న, మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పడు చేయాలని కోరుతూ మర్లపల్లి రైతులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాథోడ్ షీలాభాయి అంబాజి, రైతులు ఉన్నారు.
KMM: ఖమ్మం నగరం ఒకటో డివిజన్ కైకొండాయిగూడెంలో వెలిసిన ముత్యాలమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ నేత తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ప్రముఖ వేద పండితుడు రామలింగేశ్వర శర్మ పర్యవేక్షణలో గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిపారు.
NTR: నందిగామలోని పలు ప్రాంతాల్లో మంచినీటి పైపులైన్ లీకేజీ వల్ల తాగునీరు రోడ్ల పాలవుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఎండాకాలం, ఆపై నగరంలో అంతకంతకు పెరుగుతున్న తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. మున్సిపల్ ఆఫీస్‌కు కూత వేటు దూరంలో పైపులు పగిలి తాగునీరు రోడ్డుపై పారుతున్నా చర్యలు చేపట్టడం లేదంటున్నారు.
TG: రైతులకు మద్దతుగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కొహెడ పండ్ల మార్కెట్‌పై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు 200 ఎకరాలు కేసీఆర్ మార్కెట్ కోసం కేటాయించారన్నారు. మార్కెట్ భూసేకరణకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించిందన్నారు.
VZM: ఎమ్మెల్యే బేబినాయన సోమవారం స్దానిక సీతారామ సాగరం ఎంబనవలస వద్ద నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత అనే 100 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా మట్టి తట్ట మోసి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడుతూ… రాబోయే 100 రోజుల్లో చెరువుల పూడికతీత, కట్టల బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు.
ATP: యాడికి సభలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. అస్మిత్ రెడ్డి వినూత్న ఆలోచనలు కలిగిన ఉత్సాహవంతుడని కొనియాడారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని ఆయన ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
TG: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు మంత్రులు, ఆలయ అధికారులు సీఎంకు సాదర స్వాగతం పలికారు. ఆలయంలో పూజారులు రేవంత్ రెడ్డితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం సీఎం రూ.225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీపీ చీఫ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
SS: సోమందేపల్లి మేజర్ పంచాయతీలోని బాలాజీ నగర్‌లో సోమవారం ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ప్రతి గడపకు వెళ్లి ప్రజలను పలకరించారు. గత జగన్ ప్రభుత్వంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాయని వివరించారు. ముఖ్యంగా నేతన్న నేస్తం, చేనేత పెన్షన్ల ద్వారా లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు.
NDL: ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో రోజున పోర్టును ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో 6 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు.