NLG: ధర్వేశిపురంలో స్వయంభూ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, కుంకుమ పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈవో నాగిరెడ్డి సమక్షంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
KRNL: ఆదోని- ఆస్పరి రహదారిలోని నూతన బైపాస్ బ్రిడ్జిపై ఇవాళ ఓ లారీలో మంటలు చెలరేగాయి. బ్యాటరీ మరమ్మతు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. మంటల ధాటికి అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
BDK: చర్ల మండలం రామయ్య భవన్‌లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో బీటీ రణదేవ్ 36వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి మచ్చ రామారావు పాల్గొని మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి అఖిలభారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ధైర్యశాలి రణదేవ్, ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడు అని కొనియాడారు. నేటి యువత ఆయన మార్గంలో నడవాలని సూచించారు.
SDPT: నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో సీపీ రష్మీ పెరుమల్ ఆధ్వర్యంలో త్వరలో ఉద్యోగ మిత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్సై మానస తెలిపారు. రాయిపోల్ మండలంలోని యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ లింకులను ఇప్పటికే గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పంపినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
BHNG: రాయగిరిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు గడ్డమీది జ్యోతి మల్లేష్ గౌడ్, బెజ్జంకి రామకృష్ణ గౌడ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. చిన్న పార్టీగా అవతరించి నేడు దేశవ్యాప్తంగా అతిపెద్ద పార్టీగా విస్తరించడం పార్టీ కార్యకర్తల అఖండ దీక్ష పట్టుదలతో ఈ ఘనత సాధించామన్నారు.
చిత్తూరు: వి.కోట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, నందమూరి అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ నాయుడు అలియాస్ బుల్లెట్ నాయుడు జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ జెండా కప్పుకున్నాడు. యువ రాజకీయాలకు జనసేనాని సిద్ధాంతాలు ఆదర్శంగా ఉన్నాయని అతడు కొనియాడారు. భావితర రాజకీయానికి యువతను ప్రోత్సహించడంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు.
PDPL: రైతులు తమ పశువులకు వ్యాధులు రాకుండా తప్పకుండా టీకాలు వేయించాలని సర్పంచ్ గోపు సంతోష్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చిల్లపల్లిలో ఏర్పాటు చేసిన గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వ్యాధి వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుందని తెలిపారు. పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
W.G: నరసాపురం మండలం రుస్తుంబాదలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. మోకా దుర్గారావు తన పల్సర్ బైక్‌పై వెళ్తుండగా, టాయ్స్ సిటీ సమీపంలో టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆయనను నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
E.G: అనపర్తి మండలం రామవరంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంచి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంత్యోదయ స్ఫూర్తితో సుపరిపాలన లక్ష్యంగా సేవయే పరమావధి – దేశమే ప్రథమం అంటూ కొనసాగుతున్నారు.
ATP: యాడికి మార్కెట్ యార్డులో నిర్వహించిన సభలో స్థానిక MLA జేసీ అస్మిత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే యాడికి ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేయాలని కోరారు. స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
E.G: రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. పలు కంపెనీలోని ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. టెన్త్, ITI, డిప్లొమా, డిగ్రీ, MBA పూర్తిచేసిన 19 – 35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
CTR: చిత్తూరులో పురపాలక శాఖ మంత్రి నారాయణ సోమవారం పర్యటించారు. ఆయనకు చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ స్వాగతం పలికారు. అభివృద్ధి అంశాలపై ఆయనతో చర్చించారు. స్వాగతం పలికిన వారిలో కమిషనర్ నరసింహ ప్రసాద్, చూడ ఛైర్ పర్సన్ హేమలత, మాజీ ఎమ్మెల్సీ రాజనర్సింహులు ఉన్నారు.
MNCL: జన్నారం మండలంలో ఇసుకపై సర్వాధికారాలను ప్రభుత్వం అటవీ శాఖకు అప్పగించింది. జన్నారం కవ్వాల్ అభయారణ్య పరిధిలో ఉండడంతో అడవులు, సహజ వనరుల రక్షణలో భాగంగా అటవీ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 9 కిలోమీటర్ల వరకు ఉన్న సహజ వనరులపై అటవీ శాఖకు పూర్తి అధికారాలు లభించాయి. రెవెన్యూ శాఖ పరిధిలో ఉండే ప్రాంతాలపై కూడా అటవీ శాఖకు అధికారం లభించింది.
MDK: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ విభాగాల్లో పనిచేసే ఉత్తమ వర్కర్లను గుర్తించి సత్కరిస్తామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఏప్రిల్ 8న రక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా సురక్షిత ప్రసవాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. 9న ఎయిడ్స్ నియంత్రణపై రెడ్ రన్, 10న హోమియోపతి, ఆయుష్ దినోత్సవం సందర్భంగా కేజీబీవీల్లో, యోగా కేంద్రాల్లో యోగా సాధన చేయించాలని కోరారు.
KRNL: విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ డా.ఏ.సిరి కఠిన చర్యలు తీసుకున్నారు. సర్వే సర్టిఫికేట్లు ఇవ్వని కౌతాళం-1 సర్వేయర్‌కు రెండు ఇంక్రిమెంట్లు కట్ చేశారు. IVRS నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కారణంగా గూళ్యం వీఆర్వోను సస్పెండ్ చేస్తూ ఇవాళ ఆదేశాలిచ్చారు. ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం చేస్తే సహించేది లేదని, అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.