AP: HYDలోని ABN-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై YCP నాయకులు దాడి చేయడాన్ని హోంమంత్రి అనిత ఖండించారు. నేరప్రవృత్తి కలిగినవారే ఇలాంటి దాడులు చేస్తారన్న అనిత.. ‘మావిగన్’ డైవర్షన్ కోసమే ABNపై దాడిగి దిగారని విమర్శించారు. మావిగన్‌ను చిన్నపిల్లలు కూడా అంగీకరించట్లేదని, జగన్ వ్యాఖ్యలను గుడ్డిగా నమ్మడం సరికాదన్నారు. ఇబ్బంది ఉంటే చట్టపరంగా వెళ్లాలి కానీ దాడులు సరికాదని హితవు పలికారు.
PLD: దివ్యాంగుల పట్ల అందరూ ఉదారత చూపాలని కలెక్టర్ కృత్తికా శుక్లా కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆమె 13 మందికి ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. జిందాల్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో వీటిని అందించారు. దివ్యాంగుల సమస్యల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. ప్రతి నెలా నాలుగో శనివారం ఈ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు.
PLD: పల్నాడు ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మాచర్లలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన సతీమణి శోభారాణితో కలిసి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
NZB: రామారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారీ పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 12 కిలోమీటర్ల మేర సాగి రామారెడ్డిలో ముగిసింది. డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో జిల్లా వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు.
NZB: రామారెడ్డి మండల కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భారీ పాదయాత్ర నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 12 కిలోమీటర్ల మేర సాగి రామారెడ్డిలో ముగిసింది. డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో జిల్లా వాకర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు.
PPM: కురుపాం MPDO కార్యాలయం వద్ద APD శ్రీహరి ఆధ్వర్యంలో ఇవాళ ఉపాధి హామీ పథకం కింద గత ఏడాదిలో నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. ఉపాధి పనుల అమలు, నిధుల వినియోగం, కార్మికులకు చెల్లింపులు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో చేపట్టిన పనుల నాణ్యత, పనిదినాల నమోదు, మస్టర్ రోల్స్, కార్మికులకు అందిన వేతనాల వివరాలను పరిశీలించారు.
AP: హైదరాబాద్‌లోని ABN ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. ‘అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించారని మీడియాపై దాడికి దిగారు. మీడియా సంస్థలపైకి వెళ్లడం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనం. దాడులు, నిరసనలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు.
TG: మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు మద్ధతుగా హరీష్ రావు అక్కడకి వెళ్లనున్నారు.
TG: మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో అప్పా జంక్షన్ వద్ద పోలీసులు ఆయన్ను అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, పరిగి ఇండస్ట్రియల్ పార్క్ భూ సేకరణలో భూములు కోల్పోయిన బాధితులకు మద్ధతుగా హరీష్ రావు అక్కడకి వెళ్లనున్నారు.
NRML: బాసర ఆలయ అభివృద్ధికి రూ. 225 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ కృషి ప్రశంసనీయమని ఆలయ పూజారులు, గ్రామస్తులు తెలిపారు. మంగళవారం భైంసాలోని ఆయన నివాసంలో శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించడం ఆనందకరమన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, పూజారులు, నాయకులు పాల్గొన్నారు.
PLD: క్రోసూరు మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 14 మందికి రూ.1,07,45,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల ఆరోగ్య రక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో దోహదపడుతోందన్నారు.
NRPT: కృష్ణ మండలం చేగుంటలో మాజీ ఎంపీపీ లింగప్ప కుటుంబంపై దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ స్తంభం విషయంలో తలెత్తిన వివాదం క్రమంలో బీజేపీ సర్పంచ్ కుమారుడు సహా మరికొందరు దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో లింగప్ప తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, వెళ్తున్న కారును కుడా రాళ్లతో అడ్డుకున్నారని ఆరోపించారు.
ATP: ఏబీఎన్ రాధాకృష్ణ తీరుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వివాదాస్పద కథనాలపై రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో వారి పత్రిక ఎక్కడా కనిపించకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రజలే తరిమి కొట్టే రోజు వస్తుందని వ్యాఖ్యానించారు.
TG: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో MLA కౌశిక్ రెడ్డి దీక్ష చేపట్టారు. సిరసనపల్లిలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 48 గంటల పాటు దీక్ష చేయనున్నారు. డంపింగ్ యార్డుకు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, కాంగ్రెస్, BJP కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడంలేదని, డంపింగ్ యార్డుతో 2.50 లక్షల మందిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
KDP: లింగాల మండలం దిగువపల్లె, కోమన్నూతల గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల ప్రధాన రహదారుల రోడ్లకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీ కాలువలో చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో రోడ్లపై మురుగునీరు ఉంటోంది. గ్రామాల్లో దుర్గంధం వెదజల్లడంతో నిల్వ చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రీన్ అంబాసిడర్లు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు.