• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కొత్త బురుజుకు 30 టాయిలెట్ల మంజూరు: కలెక్టర్

NDL: డోన్ మండల పరిధిలోని కొత్త బురుజు గ్రామ అభివృద్ధిలో భాగంగా మహిళలకు 30 టాయిలెట్లు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డితో పాటు కలెక్టర్ తాగునీటి పైప్‌లైన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. టాయిలెట్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని మహిళలు తెలపడంతో కలెక్టర్ స్పందించి వెంటనే నిర్మిస్తామన్నారు.

April 9, 2026 / 02:23 PM IST

ఎయిడ్స్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

GDWL: గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ రిజ్వాన్ బాషా జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. HIV లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రిని సందర్శించి చికిత్స చేయించుకోవాలన్నారు.

April 9, 2026 / 02:22 PM IST

‘ఉపాధి హామీపై కేంద్రం కుట్ర చేస్తోంది’

SDPT: ములుగు మండల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) రద్దు చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి మండిపడ్డారు. మండలంలోని కొక్కొండ, శ్రీరాంపూర్, అచ్చయిపల్లి, బొల్లారం, జాప్తి సింగాయిపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ఆమె సమావేశమయ్యారు.

April 9, 2026 / 02:22 PM IST

హైదరాబాద్‌లో 2 లక్షల రేషన్ కార్డుల రద్దు!

TG: తెలంగాణలో అనర్హుల రేషన్ కార్డులను తొలగించేందుకు ప్రభుత్వం విజిలెన్స్ తనిఖీలు చేపట్టింది. పాన్, జీఎస్టీ ఆధారంగా హైదరాబాద్‌లోనే 2 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులకు కార్డులున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 80 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని, పూర్తి నివేదిక అందగానే వీరి కార్డులను రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

April 9, 2026 / 02:22 PM IST

జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలి: టీపీసీసీ చీఫ్

TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని అన్నారు. CM రేవంత్ రెడ్డి మళ్లీ రారని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‍ను విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో BRSపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు.

April 9, 2026 / 02:20 PM IST

గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు: ఎంపీ

NRPT: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని ఎంపీ డికే అరుణ అన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో గురువారం ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ పాల్గొన్నారు.

April 9, 2026 / 02:18 PM IST

సాయుధ బలగాల క్వార్టర్స్ పరిశీలించిన సీపీ

MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న సాయుధ బలగాల అధికారుల, సిబ్బంది క్వార్టర్స్ నూతన భవనాలను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

April 9, 2026 / 02:18 PM IST

‘రామవరంలో నీటి ఎద్దడిని నివారించాలి’

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో నీటి ఎద్దడి నివారించేందుకు చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదికన మంచినీళ్లు అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం రామవరంలోని కిన్నెరసాని భగీరథ పనుల పైప్ లైన్‌లను, నూతన ట్యాంకులను పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

April 9, 2026 / 02:16 PM IST

‘ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్ట్ చేయాలి’

PPM: వైసీపీ మహిళా పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కురుపాం నియోజకవర్గ నేతలు చినమేరంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమినేతలకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా తెలుస్తుందన్నారు.

April 9, 2026 / 02:15 PM IST

మజ్జిగకు వీరు దూరంగా ఉంటే మంచిది!

మజ్జిగ ప్రతి ఒక్కరికి మేలు చేయదు. లాక్టోజ్ ఇన్‌టోలరెన్స్ ఉన్నవారు మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. జలుబు, దగ్గు, అలర్జీ ఉన్నవారు మజ్జిగను తగ్గించాలి. ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మజ్జిగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో అల్సర్, అసిడిటీ ఉన్నవారు మజ్జిగను జాగ్రత్తగా తీసుకోవాలి.

April 9, 2026 / 02:15 PM IST

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై బహిరంగ దాడి

RR: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల ప్రచార సభలో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలను షాద్ నగర్ బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి ఖండించారు. దేశంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను చంపాలని పిలుపునివ్వడం బాధ్యత రాహిత్యమని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై బహిరంగ దాడి అని అన్నారు.

April 9, 2026 / 02:14 PM IST

‘నిబంధనల మేరకే ఇందిరమ్మ ఇంళ్లు నిర్మించుకోవాలి’

MBNR: మిడ్జిల్ మండలంలోని రాణిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంళ్లు, నర్సరీలను గురువారం ఎంపీడీవో గీతాంజలి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంళ్లను నిర్మించుకోవాలన్నారు. లేనియెడల బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు.

April 9, 2026 / 02:14 PM IST

‘నిబంధనల మేరకే ఇళ్లు నిర్మించుకోవాలి’

MBNR: మిడ్జిల్ మండలంలోని రాణిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇంళ్లు, నర్సరీలను గురువారం ఎంపీడీవో గీతాంజలి పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇంళ్లను నిర్మించుకోవాలన్నారు. లేనియెడల బిల్లుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. అనంతరం నర్సరీని సందర్శించి మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు.

April 9, 2026 / 02:14 PM IST

సిర్పూర్ (టి)లో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలుచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ (టి)లో అత్యధికంగా 40.8 డిగ్రీలు నమోదు కాగా, లోన్వెల్లి 40.5, రెబ్బెన 40.2, ఆసిఫాబాద్, తిర్యాణిలో 40 డిగ్రీలు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల్లో కూడా 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

April 9, 2026 / 02:14 PM IST

‘ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలి’

AKP: ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించడానికి పంచాయతీ ప్రత్యేక అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ సూచించారు. ఇటీవల పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే ఎలమంచిలిలో ఇవాళ సమావేశం నిర్వహించారు. త్వరలో అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తానని ఈలోగా ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

April 9, 2026 / 02:13 PM IST