మజ్జిగ ప్రతి ఒక్కరికి మేలు చేయదు. లాక్టోజ్ ఇన్టోలరెన్స్ ఉన్నవారు మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. జలుబు, దగ్గు, అలర్జీ ఉన్నవారు మజ్జిగను తగ్గించాలి. ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు మజ్జిగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కడుపులో అల్సర్, అసిడిటీ ఉన్నవారు మజ్జిగను జాగ్రత్తగా తీసుకోవాలి.